చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆ తేదీన రిలీజ్ కానుందా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కు ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.

 Charan Buchibabu Combo Movie Release Date Update Details, Ram Charan, Buchhi Bab-TeluguStop.com

గతంతో పోలిస్తే రామ్ చరణ్ మార్కెట్ కూడా కొంతమేర తగ్గిందనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు( Buchhi Babu ) డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో జాన్వి కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా ఇప్పటివరకు క్లారిటీ రాలేదని సంగతి తెలిసిందే.ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెల 27వ తేదీన రాంచరణ్ పుట్టినరోజు( Ram Charan Birthday ) సందర్భంగా రిలీజ్ కానుంది.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం మెగా అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.మార్చి నెల చివరి వారంలో విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.

ఆ విధంగా ఈ సినిమా కూడా అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Buchhi Babu, Dil Raju, Janhvi Kapoor, Ram Charan, Ramcharan, Tollywood-Mo

రామ్ చరణ్ ఈ సినిమాలోని పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ సినిమాకు చరణ్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.భారీ బడ్జెట్ సినిమాలతో చరణ్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Buchhi Babu, Dil Raju, Janhvi Kapoor, Ram Charan, Ramcharan, Tollywood-Mo

రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనుండగా సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ప్రముఖ బ్యానర్లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది.చరణ్ భవిష్యత్తు సినిమాలు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు తెరకెక్కుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube