కెనడాలో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్యకు( MP Chandra Arya ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.నేపియన్ స్థానంలో జరగబోయే సమాఖ్య ఎన్నికల్లో అభ్యర్ధిగా ఆయన దాఖలు చేసిన నామినేషన్ రద్దు అయ్యింది.
కెనడాలో హిందూ ఎంపీగా చంద్ర ఆర్యకు గుర్తింపు ఉంది.ఖలిస్తానీలు దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడుతుండటంతో వారికి వ్యతిరేకంగా చంద్ర ఆర్య గళం విప్పారు.

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో( Former Prime Minister Justin Trudeau ) ప్రభుత్వం దేశంలో ఖలిస్తానీ అనుకూల శక్తులకు ఆశ్రయం కల్పించడాన్ని ఆర్య విమర్శించారు.జూన్ 23, 1985న జరిగిన ఎయిర్ ఇండియా కనిష్క విమానం పేల్చివేతకు సంబంధించి లిబరల్ పార్టీ ఎంపీ సుఖ్ ధాలివాల్ ప్రారంభించిన పిటిషన్‌ను కూడా చంద్ర ఆర్య విమర్శించారు.ఈ బాంబు పేలుళ్లలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా చేసిన 9/11 దాడుల ముందు వరకు విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన విషాదం ఇదే.

నేపియన్‌లో ( Nepean )జరగనున్న ఎన్నికల్లో అభ్యర్ధిగా నా నామినేషన్ రద్దు చేయబడిందని లిబరల్ పార్టీ తనకు తెలియజేసినట్లు చంద్ర ఆర్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఈ వార్త తనకు నిరాశ కలిగించినప్పటికీ 2015 నుంచి నేపియన్ ప్రజలకు , కెనడియన్లకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టమని చంద్ర చెప్పారు.కర్ణాటకలోని సిరలో జన్మించిన చంద్ర ఆర్య ధార్వాడ్‌లోని కౌశాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.2006లో ఆయన కెనడాకు వలస వెళ్లారు.తొలుత ఇండో కెనడా ఒట్టావా బిజినెస్ ఛాంబర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్ర ఆర్య అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2015 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో నెపియన్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య.ఈ క్రమంలో ఆయన పలుమార్లు ఖలిస్తాన్ మద్ధతుదారులకు టార్గెట్ అయ్యారు కూడా.