పైరవీ చేసుకోలేక పద్మ అవార్డు దక్కించుకోలేకపోతున్న తెలుగు లెజెండ్స్

నాటి భానుమతి దగ్గర నుంచి నేటి కంగనా రనౌత్ వరకు చాల మంది పద్మ పురస్కారాల కోసం పైరవీ చేసుకున్నారు అనేది సుస్ప్రష్టం.భానుమతి స్వయంగా తనకు అవార్డు ఇప్పించాల్సింది అంటూ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పైరవీ చేయించింది అంటూ ఆరుద్ర భార్య రామలక్ష్మి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

 Why Tollywood Seniors Are Not Getting Padma Awards, Bhanumati ,kangana Ranaut ,r-TeluguStop.com

ఇక ఇప్పుడు చెప్పాచ్చేది ఏమిటి అంటే గతంలో చాల మంది పెద్ద వాళ్ళు ఉన్నపటికీ ముఖానికి రంగు వేసుకుంటున్నారని ఒకే ఒక్క కారణం తో ఇప్పుడు పద్మశ్రీ లు, పద్మ విభూషణ్ లు అందుకుంటున్నారు అని బాగా వినిపిస్తుంది.

Telugu Balakrishna, Bhanumati, Jaya Sudha, Jayaprada, Kangana Ranaut, Neelamsanj

ఇలాగే అందుకుంటూ పోతే ఆ అవార్డు కి ఇక విలువ ఏం ఉంటుంది.నిన్నటికి నిన్న కాలం చేసిన నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కూడా ఎలాంటి అవార్డులకు నోచుకోకుండా కన్ను మూసాడు.అలాగే కళామ్మతల్లి ముద్దు బిడ్డ అని చెప్పుకోవడే ఎస్వీ రంగారావు లాంటి మహానుభావుడికి, సావిత్రి వంటి మహానటి కూడా ఎలాంటి సత్కారాలు అందలేదు.

చివరి రోజుల్లో ఎవరి కష్టాలు వారివి.ఇలా ఎవరో ఒకరో పోతే తప్ప వారిని మనం ఎందుకు గౌరవించలేకపోయామా అని బాధ పడుతూ ఉంటాము.ఇక ఇప్పుడు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో ఇద్దరు ‘జయలు’ కనిపించే సరికి మళ్లి డౌటానుమానం పట్టుకుంది.చాల అనాసక్తి గా సాగిన ఈ షో లో జయ సుధా మరియు జయప్రద నవ నాయికా రాశి ఖన్నా తో కలిసి పాల్గొన్నారు.

Telugu Balakrishna, Bhanumati, Jaya Sudha, Jayaprada, Kangana Ranaut, Neelamsanj

ఇద్దరు జయ లను ఒక చోట కూర్చోపెట్టి మాట్లాడించడం మంచి ఆలోంచనే అయినప్పటికీ ఈ ప్రోమో ఆసాంతం ఎదో ఆసక్తి కోల్పోయినట్టుగా కనిపిచింది.ఇక ఈ ఇద్దరిలో ఎవరికి కూడా పద్మ అవార్డు దక్కలేదు.జయ ప్రద మాత్రం తనకు పద్మ శ్రీ కావాలంటే ఏకంగా ఢిల్లీ నుంచి పైరవీ చేయించుకోగలదు.అయినా ఆమెకు ఆ వైపు ఇంట్రెస్ట్ లేదు.కానీ జయసుధ కు మాత్రం ఆ లోటు సంపూర్ణంగా కనిపిస్తుంది.మరి పైరవీ చేసి మరి పదం దక్కించుకోవాలంటే కొంత మందికి ఇష్టం ఉండదు కాబట్టి వారిని ఆ గౌరవం వరించడం లేదు.

అయినా పైరవీ చేసాక దానికి ఇంకా విలువ ఏం ఉంటుంది చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube