వేసవి కాలం స్టార్ట్ అయింది.మార్చి నెలలోనే భానుడు భగభగమంటూ ప్రజలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
ఇక వేసవిలో ఎండల దెబ్బకు చెమటలు ఏ స్థాయిలో పడతాయో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు.పైన ఫ్యాన్ తిరుగుతున్నా.
ఓవైపు శరీరం నుంచి చెమటలు కారుతూనే ఉంటాయి.ఈ చెమట నుంచి దుర్వాసన వస్తే.
వారి బాధ వర్ణణాతీతం.ఇలాంటి వారు నలుగురిలో కలవాలంటేనే భయపడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే వేసవిలో చెమట దుర్వాసన నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
చాలా మంది వేసవి కాలమని చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు.కానీ, గోరు వెచ్చని నీటినే వాడాలి.మరియు ఆ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి.ఇలా చేస్తే చెమటలు పట్టడం తగ్గుతుంది.
ఒకవేళ చెమటలు పట్టినా శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది.

అలాగే బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు యాపిల్ ముక్కలు, అర కప్పు తరిగిన క్యాబేజీ, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, చిన్న అల్లం ముక్క, గుప్పెడు పార్స్లీ ఆకులు, అర లీటర్ వాటర్ పోసి గ్రౌండ్ చేస్తే జ్యూస్ తయారు అవుతుంది.ఈ జ్యూస్‌ను మార్నింగ్ సమయంలో సేవిస్తే గనుక.చర్మం యొక్క పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.
ఫలితంగా వేసవిలో చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవచ్చు.
ఇక చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ దుస్తులను ధరించాలి.
అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.మసాలా వంటలు, నూనె ఆహారాలు తీసుకోవడం మానేయాలి.
వాటర్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తరచూ తాగాలి.క్యారెట్, చేపలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు, గుమ్మడి గింజలు, ఖర్జూరం వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
తద్వారా చెమటల వల్ల వచ్చే దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు.