రోజు పెరుగు ఎందుకు తినాలి ?

మంచి పెరుగు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోయింది కాని, మన పెద్దవారిని అడిగితే చెబుతారు … అసలు పెరుగు లేకుండా భోజనం ముగించేవారం కాదని.మరి ఇప్పుడో ? వారంలో ఎన్నిరోజులు పెరుగు తింటున్నాం ?

 Know Why Curd Is Compulsory In Your Diet-TeluguStop.com

అసలు పెరుగుతో భోజనాన్ని ముగించడం తెలుగు ఇళ్ళలో వందల సంవత్సరాలుగా ఉన్న ఆచారం లాంటిది.అలాంటి మాటలు ఈ కాలం వారికి నచ్చకపోవచ్చు కాని, పెరుగు వలన ఆరోగ్యానికి ఎన్నని ఉపయోగాలు ఉన్నాయో, రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో చెప్పి చూడండి

* పెరుగులో కాల్షియం, విటమిన్ డి ప్రోటీన్, గట్ బ్యాక్టీరియా ఉంటాయి

* బిర్యాని సెంటర్స్ లో పెరుగు ఎందుకు ఇస్తారో తెలుసా ? స్పైసీ ఫుడ్ వలన ఒంట్లో జెనరేట్ అయ్యే హీట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది.పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది

* పెరుగు లో గట్ బ్యాక్టీరియా ఉండటం వలన ఇది క్రీములతో బాగా పోరాడుతుంది.రోగనిరోధకశక్తి పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడే మహిళలకు ఇది ఏంతో ఉపయోగం.

యోనిపై ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా అడ్డుకోవాలంటే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి

* కాల్షియం ఎక్కువగా ఉండటం వలన పెరుగు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.రెగ్యులర్ గా పెరుగు తినేవారికి కీళ్ళనొప్పులు రావడం, దంతాలలో నొప్పులు రావడం తక్కువగా చూసే విషయం

* కొలెస్టరాల్ లెవెల్స్ తగ్గించటానికి, బ్లడ్ ప్రెషర్ లెవల్స్ తగ్గించడానికి పెరుగు చేసే సహాయం అంతా ఇంతా కాదు.

రోజు పెరుగుతో తినాలె కాని, మీ గుండె చాలా బలంగా ఉంటుంది

* విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఉండటం వలన ఇది చర్మ ఆరోగ్యానికి కూడా పనికివస్తుంది.అలాగే స్ట్రెస్ తో బాధపడేవారు పెరుగు ఇన్టేక్ ని పెంచితే అంచి ఫలితాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube