Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

ప్రస్తుత చలికాలంలో జుట్టు డ్రై గా, డల్ గా మరియు రఫ్ గా మారడం సర్వసాధారణం.అలాగే కొన్ని సార్లు జుట్టు డ్యామేజ్ కూడా అవుతుంటుంది.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే జుట్టు ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఆయా జుట్టు స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటారు.
దాంతో ఈ సమస్యలను నివారించుకోవడం కోసం షాంపూ మరియు హెయిర్ ఆయిల్ ను మారుస్తుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్‌ రెమెడీని కనుక పాటిస్తే డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ హెయిర్ ను ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అన్నది తెలుసుకుందాం పదండి.


ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు ఎగ్స్‌ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.ఆ తర్వాత అందులో అరకప్పు పచ్చి పాలను వేసుకోవాలి.

Advertisement

అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్‌ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్‌ ఆముదం వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.కావాలంటే హ్యాండ్ బ్లెండర్ సహాయంతో కూడా కలుపుకోవచ్చు.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు కనుక ఈ రెమెడీని పాటిస్తే డ్రై, డల్, రఫ్‌ గా మారిన జుట్టు హెల్తీగా మరియు షైనీగా మారుతుంది.

అలాగే డ్యామేజ్ అయిన జుట్టు రిపేర్ అవుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు