ఈ రోజుల్లో అమ్మాయిలు తమను తాము అందంగా మార్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇటు డ్రెస్సింగ్ లో వెస్ట్రన్ లుక్( Western Look ) కోసం తమను తాము అందంగా మార్చుకుంటూ ఉన్నారు.
హెయిర్ కటింగ్ నుంచి మొదలు చెప్పుల వరకు అంతా కొత్తదనం కోసం పాకులాడుతూ ఉన్నారు.ఇలాంటి అందం రాబోయే రోజుల్లో తమ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.
కాలేజీ అమ్మాయిలే కాకుండా ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కూడా ఎక్కువగా హై హీల్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు.కొంతమంది అమ్మాయిలు హైహీల్స్ లో చాలా సౌకర్యంగా ఉన్నాయని మురిసిపోతూ ఉంటారు.
హై హిల్స్( High Heels )చాలా గంటలు ధరించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.ఇది 20 లేదా 30 సంవత్సరాల వయస్సు వరకూ హానికరంగా అనిపించదు.కానీ 40 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి మీ ఎముకలు తీవ్రంగా దెబ్బతింటాయి.దీని వల్ల శరీరం కింద భాగంలో కూడా సమస్యలు మొదలవుతాయి.రెగ్యులర్ గా హైహీల్స్ ధరించే అమ్మాయిలు మరింత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటారు.
హై హిల్స్ ధరించడం వల్ల వెన్నెముక, తుంటి ఎముకలు( Hip bone ) కూడా దెబ్బ తింటాయి.30 సంవత్సరాల తర్వాత ఇది మరింత హానికరం అవుతుంది.వాటి దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హై హీల్స్ ధరిస్తే పదాలకు పూర్తిగా సపోర్ట్ ఉండదు.పాదాల పై సమతుల్య బరువు లేకపోవడం వల్ల భరించలేని నొప్పి కూడా ప్రారంభమవుతుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం నడుము, తుంటి చుట్టూ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.హై హీల్స్ ధరించడం వల్ల మడిమలలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే అధిక బరువు( Overweight ) ఉన్నవారు ఎక్కువసేపు హై హీల్స్ ధరిస్తే సమతుల్యం కోల్పోవడం వల్ల చిలా మండలం లో తీవ్రమైన నొప్పి వస్తుంది.హై హిల్స్ ధరించడం వల్ల కొంతమందిలో రక్తప్రసరణ వ్యవస్థలో కూడా ఆటంకం ఏర్పడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే రోజు హై హిల్స్ ధరించడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.