ఎండు ద్రాక్షలు(రైసిన్స్).అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు అపారమైన పోషక విలువలనూ నిండి ఉంటాయి.
అందుకే వీడిని డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని, అనేక జబ్బులు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అలాగే చర్మ సౌందర్యానికి ఎండు ద్రాక్షలు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఎండు ద్రాక్షలతో తయారు చేసిన ఫేస్ జెల్‌ను వాడితే అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఆలస్యం ఎందుకు ఎండు ద్రాక్షలత్ ఫేస్ జెల్ ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? అసలు ఆ జెల్ ను వాడటం వల్ల ఏయే బెనిఫిట్స్ పొందొచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని అందులో పది ఎండ్రు ద్రాక్షలను వేసి నీరు పోసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.ఉదయాన్నే నీరు తీసేసి ఎండ్రు ద్రాక్షలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఎండు ద్రాక్షల పేస్ట్, ఒక స్పూన్ అలోవెర జెల్, మూడు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ న్యాచురల్ రైసిన్ ఫేస్ జెల్ సిద్ధమైనట్టే.ఈ జెల్‌ను గాలి చొరబడని ఒక డబ్బాలో నింపుకుని ఫిజ్‌లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఇక రాత్రి నిద్ర పోయేముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తం తొలగింది ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇప్పుడు తయారు చేసుకున్న జెల్‌ను ముఖానికి అప్లై చేసి పడుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.ముడతలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది.మరియు డార్క్ స్పాట్స్ సైతం దూరం అవుతాయి.