1.మూడో రోజు ఈడీ విచారణ సోనియా
హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మూడో రోజు ఈడి విచారణకు సోనియా గాంధీ హాజరయ్యారు.
2.ఆప్ ఎంపీపై రాజ్యసభ సస్పెన్షన్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ ను వారం రోజుల పాటు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
3.మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణలో వర్షాలు సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
4.మూసికి రెండో ప్రమాద హెచ్చరిక జారి
మూసి పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
5.ఏటూరు నాగారం వరంగల్ మధ్య రాకపోకలు బంద్
ఏటూరు నాగారం వరంగల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
6.రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
విశాఖ ఋషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.రిసికొండలో అనుమతించిన దానికంటే అక్రమ తవ్వకాలు జరిపితే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది.
7.అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు
టిడిపి కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు పాల్గొన్నారు.
8.శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ బుధవారం ఉదయం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు.
9.వరంగల్ – వేటూరి నాగారం మధ్య రాకపోకల బంద్
ఏటూరు నాగారం వరంగల్ రాకపోకలు బంద్ అయ్యాయి.పస్రా – తాడ్వాయి మధ్య జనగలచ వాగు పొంగి పోర్లడం తో రాకపోకలు నిలిచిపోయాయి.
10.మూసి ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేత
మూసి ప్రాజెక్టుకు వరద ప్రభావం పెరుగుతుండడంతో ప్రాజెక్ట్ కు ఉన్న ఎనిమిది గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు.
11.ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయక కార్యక్రమాలు
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.
12.తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఏపీ తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపు పై కేంద్రం స్పష్టత ఇచ్చింది.అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణలు అవసరమని , 2026 జనాభా లెక్కల వరకు నియోజకవర్గాల పెంపు కోసం వేచి ఉండాల్సిందేనని ప్రకటించింది.
13.రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్ పై కేటీఆర్ స్పందన
రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
14.గొర్రెల పంపిణీ డిడిలకు స్పెషల్ డ్రైవ్
తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ అర్హులైన లబ్ధిదారులు తమ వాటా దానంగా డీడీలు చెల్లించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
15.యాదగిరి గుట్ట లో కోటి కుంకుమార్చనకు ఏర్పాట్లు
ఈనెల 29న ప్రారంభం కానున్న శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు.దీనికోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు.
16.శాంతా సింహ నవీన్ కు గీతం గౌరవ డాక్టరేట్లు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హా తో పాటు, ప్రఖ్యాత తెలుగు నవల రచయిత అంపశయ్య నవీన్ కు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ప్రధానం చేయనున్నట్లు గీతం యూనివర్సిటీ తెలిపింది.
17.జనసేనతో పొత్తు వ్యవహారంపై సోము వీర్రాజు ప్రకటన
తాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా… జనసేన తోనే తమ ప్రయాణం ఉంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
18.మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్
రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ ఎంపీలు సస్పెన్షన్ చేయడంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు.కేటీఆర్ గతం మర్చిపోయావా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మా ముగ్గురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.
19.5 జీ వేలం నేటితో ముగింపు
వేగంతో కూడిన డేటా నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు ఉద్దేశించిన 5g స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నేటితో ముగియనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర -46,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,680
.