ఎప్పటికపుడు పెళ్లిళ్లకు ( weddings )సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.వాటిలో చాల వరుకు నవ్వులు పూయిస్తుంటాయి మరికొన్ని అందరిని ఆలోచింప చేసే లాగా ఉంటాయి.
అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ( Daughter-in-law, son-in-law )ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, స్నేహితులు వేదికపై సరదాగా ప్రాంక్ చేయడం వంటివి చూస్తుంటాం.ఇంకా పెళ్లి వేడుకలలో భాగంగా భోజనాల దగ్గర కూడా ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి.
ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.పెళ్లిలో దోసెలు వేస్తుంటే అతిథులు ఏం చేశారో చుస్తే ఒక్కసారిగా ఆశ్చర్య పోవాల్సిందే.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.ఒక పెళ్లి వేడుకలో అతిథుల కోసం రకరకాల విందు భోజనాలు ఏర్పాటు చేశారు.అందరూ భోజనశాలలోని వివిధ కౌంటర్ల వద్ద తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.
అలా దోసెలు వేసే చోట ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది.చాలా మంది ఒక్కసారిగా దోసెలు వేస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు.
అంతేకాకుండా అంతా వాటిని తినేందుకు భారీ స్థాయిలో పోటీ పడ్డారు.
చేసేదేమీ లేక వంట వారు కూడా ఓపిగ్గా దోసెలు వేయడం మొదలు పెట్టారు.ఈ తరుణంలో వంట వారు ఇలా దోసెలు వేస్తున్నారో లేదే.అలా వెంటనే వారు వాటిని ప్లేటులోకి లాగేసుకుంటున్నారు.
అదికూడా దోస పెన్నం మీద ఉన్న సమయంలో జరిగింది.అలాగే వారి మధ్య తోపులాట కూడా జరిగింది.
ఒకరినొకరు తోసుకుంటూ దోసెల కోసం ఎగబడ్డారు.ఎవరికి వచ్చిన ముక్కను వారు ప్లేటులో వేసుకుని తినడం మొదలు పెట్టారు.
ఈ వీడియో చుసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చార్రా మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.