హేమ… టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ విజయవంతమైన నటిగా మనందరికీ పరిచయమే.కేవలం నటిగానే కాదు అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా ఆమె కేర్ ఆఫ్ అడ్డ్రస్ గా మారుతూ సోషల్ మీడియాలో అలాగే మీడియాలో నానుతూ ఉంటుంది.
హేమ ఏదైనా మాట్లాడిందంటే చాలా ముక్కుసూటిగా ఉంటుంది అని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.దాంట్లో నిజం ఉంటేనే హేమ ఖచ్చితంగా మాట్లాడుతుంది అనేవారు కూడా ఉన్నారు.
ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే కూడా అదొక సంచలనానికి దారితీస్తుంది.ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూస్ లో కూడా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడుతూ ఉంటుంది.
ఇలా హేమ ఇంటర్వ్యూస్ లో మాట్లాడి అప్పుడప్పుడు చిక్కుల్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక తన గురించి కొన్ని విషయాలు చెబుతూ తన ప్రాణ స్నేహితురాలు ఎవరు అనే విషయాన్ని కూడా బయటపెట్టింది.
తోటి నటి అయిన సురేఖ వాణి తనకు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని, తన కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తానని హేమ బయటపెట్టింది.తను మాత్రమే కాదు తన కూతురు ఈషా అలాగే సురేఖ వాణి కూతురు సుప్రియ కూడా మంచి స్నేహితులు అనే విషయాన్ని కూడా తెలిపింది.

వారి స్నేహాన్ని చూసి ఓర్వలేక విడగొట్టాలని ప్రయత్నం చేసినట్టు కూడా చెప్పింది.అందుకోసం తన కూతురిని స్కూల్ మార్పించిందని అయినా కూడా సుప్రియ కూతురు మళ్ళీ తన కూతురు చదివే స్కూల్ కే వచ్చిందని, దానికి గల కారణం సుప్రియ బోల్డ్ గా ఉండటమే అంటూ తనదైన రీతిలో సమాధానం చెప్పింది హేమ.ఇక హేమ సురేఖవాణితో కూడా ఇటీవల గ్యాప్ వచ్చిందని విషయాన్ని వెల్లడించిది.తను షూటింగ్ లో ఉండగా తన వెనకాల తన గురించి చెడుగా మాట్లాడటం వల్ల సురేఖ వాణి ని దూరం పెట్టినట్టుగా కూడా చెప్పింది.
అందుకే తన ప్రాణ స్నేహితురాలు అయినా సురేఖ వాణి తో దూరంగా ఉండటం జరుగుతుందంటూ తెలిపింది.