మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో షుగర్( Sugar ) ఒకటి.టీ కాఫీ రూపంలో లేదా స్వీట్స్ రూపంలో షుగర్ ను నిత్యం మన బాడీ లోకి పంపుతూనే ఉంటాము.
బరువు పెరగడం, గుండె జబ్బులు, క్యాన్సర్, కావిటీస్ ఏర్పడటం, డిప్రెషన్ వంటి ప్రతికూలతలే తప్పా ఆరోగ్యపరంగా షుగర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేము.కానీ చర్మానికి మరియు కేశ సంరక్షణకు షుగర్ చాలా బాగా సహాయపడుతుంది.
ముఖ్యంగా షుగర్ తో మృదువైన మరియు మెరిసే కురులను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ జుట్టుకు షుగర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వైట్ షుగర్ వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూ, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు ఒక కప్పు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి, చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మరోసారి కలుపుకోవాలి, ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ విధంగా కనుక చేశారంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి. షుగర్ డ్రై హెయిర్ ( Sugar dry hair )ను సమర్థవంతంగా రిపేర్ చేస్తుంది.జుట్టు చాలా మృదువుగా మరియు మెరిసేలా ప్రోత్సహిస్తుంది.షాంపూకు షుగర్ ను జోడించడం వల్ల స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిపోతాయి.మురికి మొత్తం పోతుంది.కొత్త జుట్టు పెరుగుదలకు కూడా షుగర్ సహాయపడుతుంది.
అలాగే రోజ్ వాటర్ స్కాల్ప్ ఎల్లప్పుడూ తాజాగా కనిపించేలా చేస్తుంది.స్కాల్ప్ యొక్క పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేసి.
చుండ్రును దూరంగా ఉంచుతుంది.ఇక కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది.