తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకోని సంఘటనలు అయితే జరుగుతున్నాయి.ఇక పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే…మరి ఆ మహిళ మృతి పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాత్రం ఈ సంఘటన మీద తీవ్రమైన ఫైర్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక అసెంబ్లీలో ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ ఇకమీదట బెనిఫిట్స్ షోస్ రద్దు చేస్తున్నట్టుగా తెలియజేశారు.
అయితే బెనిఫిట్స్ షో స్ రద్దు చేయడం వల్ల పెద్ద సినిమాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి.ఎందుకంటే వాళ్ళ అభిమానులు ప్రేక్షకులందరితో కాకుండా ఒకరోజు ముందే వాళ్ళ సినిమాలను చూడాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇక అలాగే ఆ షోలకు విపరీతమైన డబ్బులను పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.తద్వారా మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ ని ఎక్కువ చూపించుకోవడానికి భారీ కలెక్షన్స్ ని రాబట్టడానికి బెనిఫిట్ షోస్ అనేవి చాలావరకు యూజ్ అవుతూ ఉంటాయి.కానీ అనుకోని సంఘటనలు జరుగుతున్న క్రమంలో మినిమం సెక్యూరిటీ కూడా లేకుండా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఇక ఆ ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోస్ కి గాని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గాని తను విరుద్ధం అంటూ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు.మరి మొత్తానికైతే ఆయన ఉనన్ని రోజులు ఇక బెనిఫిట్స్ కి అనుమతి అయితే లేదు అని ఖరాఖండిగా చెప్పేసారు.ఇక దీనివల్ల పెద్ద సినిమాలకు భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి… మరి ఏది ఏమైనా కూడా పెద్ద సినిమాలు భారీ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం ఒకరకంగా ఇబ్బందనే చెప్పాలి…
.







