ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది.మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు భారీ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం విశ్వంభర ( Vishwambhara movie )అనే సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు 70 సంవత్సరాల వయసులో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న నటుడు చిరంజీవి…ఆయనను చూసి ప్రతి ఒక్క యంగ్ హీరో కూడా నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ ఏజ్ లోనే ఆయన ఇంతలా కష్టపడుతున్నాడు అంటే యంగ్ హీరోలు ఇంకా ఎంతలా కష్టపడాలి.
ఆయనను చూసుకుంటూ చాలా నేర్చుకుంటూ మరింత ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని మెగాస్టార్ గా దాదాపు 45 సంవత్సరాల నుంచి వెళుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి( Chiranjeevi )… ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంభర సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు.తద్వారా ఆయన పాన్ ఇండియాలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి కంటే కూడా వశిష్ఠకి చాలా కీలకంగా మారబోతుంది.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన బింబిసార సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు.తద్వారా ఆయనకు భారీ ఆఫర్లు రావడమే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలను చేసే అవకాశం కూడా వస్తుంది.లేదంటే మాత్రం ఈ సినిమాతో తట్టా బుట్ట సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…అందుకే వశిష్ట కూడా ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
.







