ఈ ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన పండ్లను వరంగా ప్రసాదించింది.అందులో డ్రాగన్ ఫ్రూట్( Dragon fruit ) ఒకటి.
చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ పండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.ఆరోగ్యపరంగా డ్రాగన్ ఫ్రూట్ అనేక లాభాలను చేకూరుస్తుంది.
అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ మాస్క్ వేసుకుంటే మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోవడం గ్యారంటీ.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పీల్ తొలగించిన డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే అర కప్పు పచ్చి పాలు( raw milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( rice flour ) వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే మీ చర్మం లో ఛేంజ్ అనేది కనిపిస్తుంది.ఈ ఫ్రూట్ మాస్క్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.ముఖం తెల్లగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అలాగే ఈ ఫ్రూట్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో సహజ చక్కెరలు మరియు హైడ్రేటింగ్ సమ్మేళనాలు ఉంటాయి.ఇవి చర్మాన్ని తేమ గా మార్చడంలో సహాయపడతాయి.అంతేకాకుండా డ్రాగన్ పండులో ఉండే విటమిన్ సి మెండుగా ఉంటుంది.
ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో ఉత్తంగా తోడ్పడుతుంది.







