ఈ ఆహార పదార్థాలను మరుసటి రోజు తింటే ఆరోగ్యానికే ప్రమాదం..

చాలామంది రాత్రిపూట మిగిలిపోయిన ఆహారం ఉదయం పూట వేడి చేసుకుని తింటూ ఉంటారు.ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అయితే ఆహారం వృధా చేయడం మంచిది కాదు.అలాగని అనారోగ్యకరమైన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.

మిగిలిపోయిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి తీవ్రమైన హానీ జరుగుతుంది.అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన భారత దేశంలో నూనెల వినియోగం ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే నూనెల మండిన ఆహారం రుచిగా ఉంటాయి.

Advertisement

కాబట్టి ఇక పెళ్లిళ్లలోనూ, పార్టీలలోను మిగిలిన ఆయిల్ ఫుడ్( Oily food ) ని ప్యాక్ చేసి మరుసటి రోజు వేడి చేసి తింటూ ఉంటారు.

ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.ఎందుకంటే ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం వలన గుండె జబ్బులు( Heart diseases ) వస్తాయి.అంతేకాకుండా మధుమేహం( diabetes ) కూడా పెరుగుతుంది.

అలాగే బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది.ఇక ఉడికించిన బంగాళదుంపలను తినడానికి చాలామంది ఇష్టపడతారు.

అలాగే ఉడికించిన బంగాళాదుంపలతో ఎన్నో రకాల వంటకాలు చేస్తారు.ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ లో అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వీటిలో రెండు రోజుల క్రితం ఉడకబెట్టిన బంగాళాదుంపలను ( Potatoes )ఉపయోగిస్తారు.ఇది తినడం వల్ల మన కడుపులో వివిధ సమస్యలకు కారణం అవుతుంది.

Advertisement

ఇక గుడ్డు తినడం( egg ) మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అయితే దీన్ని ప్రత్యేకంగా టిఫిన్ గా తీసుకోవడమే ఉత్తమం అని చెప్పవచ్చు.కానీ మరుసటి రోజు తినడం మాత్రం అసలు మంచిది కాదు.

ఉడకబెట్టిన గుడ్డును ఒకరోజు తర్వాత తినడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అలా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఎందుకంటే ఉడకబెట్టిన గుడ్డులో ఒక రోజు తర్వాత అనేక రకాల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.అలా బ్యాక్టీరియా వృద్ధి చెందిన గుడ్డును మనం మరుసటి రోజు తినడం వలన ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.

తాజా వార్తలు