కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య( Nijjar Murder Case ) కేసు విచారణలో భాగంగా ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలో భారత అధినాయకత్వాన్ని టార్గెట్ చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 Canada Again, Floats Target Indian Leadership At Pro Khalistan Rally , Khalista-TeluguStop.com

ఆదివారం టొరంటోలో జరిగిన ర్యాలీలో భారత వ్యతిరేక పరిణామాలు కనిపించాయి.దాదాపు 6 కిలోమీటర్ల పాటు సాగిన కవాతులో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునేలా వేర్పాటువాద నినాదాలు వున్నాయి.

ఇందులో ప్రధాని నరేంద్ర మోడీని కటకటాల వెనుక చూపించారు.త్వరలో జరగనున్న ఖలిస్తాన్ రెఫరెండంలో ఎక్కువమంది పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Telugu Hardeepsingh, Indians, Justin Trudeau, Khalistan, Narendra Modi, Nijjar,

దాల్ ఖల్సాకు చెందిన పరమ్‌‌జిత్ మాండ్, భారత భద్రతా ఏజెన్సీలు ఉగ్రవాదిగా ప్రకటించిన అవతార్ సింగ్ పన్నూలు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారని నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఈ ఈవెంట్‌లో తళుక్కునమెరిసే ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కనిపించకపోవడం గమనార్హం.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాలకు పన్నూన్ హాజరుకావడం లేదు.మరోవైపు.

టొరంటోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఖలిస్తాన్ నినాదాలు వినిపించడంపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఢిల్లీలోని కెనడా డిప్యూటీ హైకమీషనర్‌ను పిలిపించింది.

వేర్పాటువాదం, తీవ్రవాదం, హింసకు కెనడాలో పొలిటికల్ స్పేస్ ఇవ్వబడిందని ఈ సంఘటన నిరూపించింది.అంటారియో గురుద్వారా కమిటీ (ఓజీసీ)చే వార్షిక నగర్ కీర్తన పరేడ్ జరిగింది.

Telugu Hardeepsingh, Indians, Justin Trudeau, Khalistan, Narendra Modi, Nijjar,

ఇకపోతే.నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) స్పందించారు.శనివారం టొరంటో గాలాలో జరిగిన సిఖ్ హెరిటేజ్ డేలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడా రూల్ ఆఫ్ లా , స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్న దేశమని పేర్కొన్నారు.

పౌరులందరి రక్షణే తమ ప్రాథమిక నిబద్ధత అని ట్రూడో స్పష్టం చేశారు.ఆర్‌సీఎంపీ చెప్పినట్లుగానే .నిజ్జర్ హత్యలో అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయంపై ప్రత్యేక, విభిన్న దర్యాప్తు కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలోని సిక్కు సమాజం తాము అసురక్షితంగా వున్నట్లుగా భావిస్తున్నారని జస్టిన్ ట్రూడో అన్నారు.

ప్రతి కెనడియన్‌కు ఈ దేశంలో వివక్ష, హింస, బెదిరింపుల నుంచి సురక్షితంగా వుండేందుకు ప్రాథమిక హక్కు వుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube