తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆర్య సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను చేసే స్థాయికి ఎదిగాడు.
అంటే సినిమాలు తీయడానికి ఆయన పడిన కష్టమే అందుకు కారణమని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు పుష్ప 2( Pushpa 2) సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని కొట్టి తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో 1500 కోట్ల.
వసూళ్లను సాధించడమే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదంతా ఓకే అయినప్పటికీ సుకుమార్( Sukumar ) మాత్రం ఈ సినిమాలో ట్విస్ట్ ల విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ట్విస్టులు రివిఐయల్ కాకుండా సీక్రెట్ గా షూట్ చేయాల్సిన అవసరమైతే ఉంది.అలా కాకుండా సినిమా యూనిట్ మొత్తాన్ని పెట్టుకొని ఆయన సినిమాని షూట్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక రాజమౌళి ( Rajamouli )లాంటి డైరెక్టర్లు ట్విస్ట్ లను రివిల్ చేయకుండా ఉండడానికి తన టీమ్ మొత్తాన్ని కాకుండా తను మాత్రమే కొంత మంది ఆర్టిస్టులతో షూట్ చేసుకుని వస్తూ ఉంటాడు.
అందువల్లే
రాజమౌళి సినిమా
లో ట్విస్టులు చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి.మరి ఇప్పుడు సుకుమార్ మాత్రం అలా చేయకుండా ఓపెన్ గా షూట్ చేస్తున్నారనే టాక్ అయితే వస్తుంది.మరి పుష్ప 2 సినిమాలో కూడా భారీ ట్విస్ట్ లైతే ఉన్నాయి.
కాబట్టి ఎక్కువ మంది యూనిట్ తో షూట్ చేస్తే ఈ ట్విస్టులన్ని రివిల్ అయ్యే అవకాశం అయితే ఉంది.ఇక ఈ విషయంలోనే సుకుమార్ నిర్లక్ష్యం వహిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు విపరీతమైన కామెంట్స్ అయితే పెడుతున్నారు…
.