షిరిడి సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.. నిషేధం పై కీలక నిర్ణయం..!

షిరిడి సాయిబాబా( Shirdi Sai baba ) భక్తులకు సంస్థాన్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది.అయితే సాయిబాబా గుడికి పూలు, దండలు, ప్రసాదం తీసుకువెళ్లడం నిషేధం చేయబడింది.

 The Ban On Offering Garlands And Flowers In Shirdi Will Be Lifted Soon,shirdi Sa-TeluguStop.com

అయితే ప్రస్తుతం సాయిబాబాకు పూలు, దండలు, ప్రసాదం తీసుకువెళ్లడంపై ఉన్న నిషేధాన్ని తొలగించారు.అందుకే ఇకనుంచి భక్తులు గుడికి వెళ్లే సమయంలో దండలు, పూలు, ప్రసాదాలు తీసుకొని వెళ్ళవచ్చు.

దీన్ని అనుమతిస్తూ సాయి సంస్థాన్( Sansthan Trust ) నిర్ణయం తీసుకుంది.సాయి సంసారం ద్వారా భక్తులకు సరసమైన ధరలకే పూలను అందించనున్నారు.

Telugu Bhakti, Devotional, Farmers, Garlands, Sansthan, Shirdi, Shirdi Sai Baba-

అలాగే రైతుల నుంచి నేరుగా పూలను కొనుగోలు చేసి ఆలయ ప్రాంగణంలో సాయి భక్తులకు పుష్పాలను అందుబాటులో ఉంచనున్నారు.ఇలా చేయడం వలన రైతులకు అలాగే భక్తులకు కూడా లాభదాయకం ఉంటుంది.దీని వల్ల సాయి బాబా భక్తుల నుండి జరుగుతున్న దోపిడీ ఆగిపోవడంతో పాటు రైతులకు( Farmers ) కూడా శ్రమకు తగిన ధర లభిస్తోంది అని సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది.అయితే రెండేళ్ల క్రితం కరోనా వైరస్( Coronavirus ) వెలుగులోకి వచ్చిన తర్వాత సాయి ఆలయానికి పూలు, దండలు, నైవేద్యాలు తీసుకురావడం పై నిషేధం విధించారు.

ఆ సమయంలో విధించిన నిషేధం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది.అందుకే ఈ నిషేధం కారణంగా షిర్డీకి చెందిన రైతులతో పాటు చుట్టుపక్కల దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు( Flowers Farming ) చేస్తున్న రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది.

అయితే ఎనిమిది నెల క్రితమే ఈ నిషేధాన్ని తొలగించాలని రైతులు, వ్యాపారులు డిమాండ్ చేశారు.అలాగే ఆలయ ముఖ ద్వారం వద్ద నిరసన కూడా తెలిపారు.

ఈ విషయంపై పరిష్కారం కనుగొనడానికి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ అధ్యక్షత ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

Telugu Bhakti, Devotional, Farmers, Garlands, Sansthan, Shirdi, Shirdi Sai Baba-

పూలమాలలు, పూలు, ప్రసాదాలు సమర్పించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని బాబా భక్తులు( Baba Devotees ) డిమాండ్ చేస్తున్నారు.కాబట్టి ఈ విషయాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధ్యయన కమిటీ ఒక నివేదికను రూపొందించడం జరిగింది.సాయి సంస్థాన్ ఈ నిషేధాన్ని ఎత్తివేయడానికి చొరవ తీసుకుంది.

అంతేకాకుండా ఇందుకు సంబంధించి దరఖాస్తులు కూడా కోర్టులో దాఖలు చేశాయి.సాయి సంస్థాన్ తమ నిర్ణయాన్ని ఆమోదించాలని కోర్టులో సివిల్ దరఖాస్తులను దాఖలు చేసి సాయి సంస్థాన్ కోర్టు నుండి అనుమతిని పొందింది.

దీంతో కరోనా కాలంలో ప్రారంభమైన ఈ ఆంక్షలు ఎత్తివేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube