సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బెమ్మలు ఎందుకు పెడ్తారో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి.ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి పండుగను మరింత వేడుకగా చేసుకుంటారు.

 What Is The Reason Behind We Put Gobbemmas Infront House, Gobbemma, Sankranthi ,-TeluguStop.com

సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలు, పిండి వంటలతో  అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.కానీ వేకువ జామునే ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడతారు.

మనకు అలా ఎందుకు పెడతారో తెలియక  పోయినప్పటికీ.సంప్రదాయం అంట మనం కూడా పెట్టేస్తాం.

కానీ దాని వెనుక కథ ఏంటో మనకు తెలియదు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గొబ్బెమ్మను గౌరీ మాతగా కొలుస్తారు.మరి కొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయనీ దేవిగా కూడా ఆరాధిస్తారు.

పేడతో తయారు చేసిన చిన్న చిన్న ముద్దలైన గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం.ఈ ముద్దల మీద కనిపించే రంగుల పూల రేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పుణ్య స్త్రీలకు సంకేతం.

అందుకే పేడ ముద్దలను గొబ్బెమ్మలుగా కొలుస్తూ… పండుగ రోజు వివిధ రంగులతో ముగ్గులు వేసి అందులో పెడతారు.వాటిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు.

అందలో పెద్ద గొబ్బెమ్మను గోదా దేవిగా కొలుస్తారు.

ఇక వాటి చుట్టు ఆడ పడుచులు తిరుగుతూ సందడి చేస్తారు.ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం.అందుకే పండుగ పూట అందమైన ముగ్గులు వేసి.

అందులో వివిధ రంగులు వేసి అందంగా అలంకరిస్తారు.అందమైన ముగ్గులతో పాటు గొబ్బెమ్మను కూడా అందులో ఉంచి లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానిస్తారు.

లక్ష్మీ దేవి ఇంటికి వస్తే సిరి సంపదలు, సంతోషాలే కాకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీ ఒక్కరికి తెలిసిన వియమే.

What Is The Reason Behind We Put Gobbemmas Infront House, Gobbemma, Sankranthi , Traditions , Hindus , Katyani Devi , Lakshmi Devi - Telugu Devotional, Gobbemma, Hindus, Katyani Devi, Lakshmi Devi, Sankranthi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube