ఎలాంటి మచ్చ లేకుండా ముఖ చర్మం తెల్లగా అందంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి.అయితే అటువంటి చర్మాన్ని అందరూ పొందడం అసాధ్యమని కొందరు భావిస్తుంటారు.
కానీ సాధ్యమే.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మచ్చలు పోగొట్టడమే కాదు ముఖ చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మార్చడానికి కూడా ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బంగాళదుంప( potato )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి.
అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు( milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్( Oats powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.చివరిగా సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న కొద్ది రోజుల్లోనే క్రమంగా మాయం అవుతాయి.అలాగే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా మారుతుంది.కాబట్టి ఎవరైతే మచ్చలేని తెల్లటి మెరిసే చర్మాన్ని పొందాలని కోరుకుంటున్నారో తప్పకుండా వారు ఈ రెమెడీని పాటించండి.మంచి రిసల్ట్ మీ సొంతం అవుతుంది.







