అడవిలో జంతువుల వేట ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.అది ఎలా ఉన్నా కూడా క్రూర జంతువులకు సంబంధించిన వీడియోలకు నెట్టింట ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.
ఇక నేతలపైనే అత్యంత తెలివిగా వేటాడే జంతువుల్లో క్రూర మృగాలు ముందు వరుసలో ఉన్నాయి.ఈ క్రూర మృగాల్లో కూడా ముఖ్యంగా చిరుత పులికే అత్యధికంగా ప్రాధాన ఉందని చెప్పాలి.
దీని వేట మిగతా జంతువులతో పోలిస్తే చాలా క్రూరంగా ఉంటుంది.ఎంతలా అంటే కనురెప్ప వాల్చే లోపే మెరుపు దాడి చేసి జంతువులను తమ ఆహారంగా మార్చేసుకోగలవు.
ఇక సోసల్ మీడియాలో అత్యంత ఆదరణ కేవలం చిరుత వేటకే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా మిగతా క్రూర జంతువులేమో నేలపైనే వేటాడితే చిరుత పులి మాత్రం చెట్టుపై నుంచి అమాంత దూకేసి తన ఎరను వేటాడేస్తుంది.
చిన్న జంతువులకు కనిపించకుండా చెట్టుపై నక్కి నక్కి ఒకేసారి దూకి వేటాడటంతో చిరుత చాలా నేర్పరి అనే చెప్పాలి.ఈ విధంగా వేటాడి చిరుత తన ఆహారాన్ని సేకరించుకుంటుంది.
అయితే ఇప్పుడు ఇలాగే చిరుత వేటాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.దాని గురించి తెలుసుకుందాం.
చిరుత పులి తనకు సమీపంలోనే జింకలు మేస్తూ ఉండటాన్ని గమనించింది.అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ చెట్టును ఎక్కేసి అక్కడ నక్కింది.ది.జింకల గుంపు తన దగ్గరకు వచ్చేంత వరకు కూడా వాటిని నక్కి నక్కి చూస్తోంది ఆ చిరుత.ఇక జింకలు చిరుతను గమనించకుండా ఆ చిరుత ఉన్న చెట్ఉకు దగ్గరగా వస్తాయి.ఇక ఎప్పుడెప్పుడా అని చూస్తున్న చిరుత ఒక్క సారిగా ఓ జింక మీదకు దూకేసి దాన్ని అమాంతం పట్టేసుకుంటుంది.
ఇంకేముంది ఆ జింక కాస్తా చిరుతకు ఆహారంగా మారిపోతుంది.
.