సినిమాలో కథ కథనం ఎంత బాగున్నా.హీరో హీరోయిన్లు ఎంత బాగా నటించినా.
సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అంటే ప్రతి సినిమా కి అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్స్ అవసరం అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు.
దీంతో ప్రేక్షకుల ఆదరణ కరువైన నష్టాలు తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు.ఇటీవలి కాలంలో దర్శక నిర్మాతలందరూ కూడా సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఇక సినిమా ప్రమోషన్స్ కోసం అంతకుమించి అనే రేంజ్ లోనే కష్టపడుతున్నారు.
ఈ క్రమంలోనే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే అటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇక ప్రమోషన్స్ నిర్వహిస్తూ కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.ఇటీవలి కాలంలో సినిమా దర్శకనిర్మాతలు అందరికీ కూడా బుల్లితెర ప్రమోషన్స్ కి మెయిన్ అడ్డాగా మారిపోయింది.
బుల్లితెర లో ఫేమస్ అయిన పలు షోలలోకి వెళ్లడం ప్రమోషన్స్ చేయడం లాంటివి చేస్తున్నారు.ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే మల్లెమాల షోలలో ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతూ ఉండడం గమనార్హం.
ఫేమస్ అయిన షోలలో ప్రమోషన్స్ చేస్తే ఎంతోమందికి సినిమా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారూ దర్శక నిర్మాతలు.

అయితే జబర్దస్త్ షోలో ఇలా ఒక మూవీ ప్రమోషన్ నిర్వహించడానికి గట్టిగానే ఛార్జ్ చేస్తారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.జబర్దస్త్ లో ఒక సినిమాకు ప్రమోషన్ నిర్వహించాలి అంటే దాదాపు 15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందట.అంతేకాదు మల్లెమాల వారు నిర్వహిస్తున్న సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో ప్రమోషన్స్ కావాలంటే పది నుంచి పదిహేను లక్షలు ముట్ట చెప్పాల్సిందేనని… అయితే చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ప్రమోషన్ బుల్లితేరా కార్యక్రమాలకు ఫ్రీ గా చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఇలా పదిహేను లక్షల వరకు ప్రమోషన్స్ కోసం చెల్లిస్తారు అన్న విషయం తెలిసి షాక్ అవుతున్నారు .