ప్రస్తుత సమాజంలో చాలా మంది నోటి పూతల సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఇలాంటి సమస్యతో తరచుగా ఇబ్బంది పడేవారు తప్పకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అలర్జీ, హార్మోన్లలో మార్పు కడుపు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి నోటిలో బొబ్బలు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి.
నోటిలో బొబ్బలు వల్ల చాలా రకాల సమస్యలు రావచ్చు.నోటిపూత వల్ల తినడానికి, తాగడానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
ఇలాంటి సమస్యను వైద్య భాషలో క్యాంకర్ సోర్ అని కూడా అంటారు.కొన్నిసార్లు నోటి క్యాన్సర్లు కూడా ఇది కారణం కావచ్చు.

కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అంతేకాకుండా కొందరిలో జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించాలి.తులసి మొక్కలు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉంటాయి.అంతేకాకుండా విచ్చలవిడిగా ఈ ఆకులు అందుబాటులో ఉంటాయి.ఈ ఆకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు నోటిపూతల నుంచి రక్షించి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఇంకా చెప్పాలంటే కొబ్బరి నూనె నోటి పూత, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.కొబ్బరి నూనెను నీళ్లలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.అంతేకాకుండా నోటి అల్సర్లను తగ్గించడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.లికోరైస్ లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నోటి అల్సర్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జామపండు గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా తేనె కలిపి నోటి పూత ఉన్నచోట అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.
