నా జీవితంలో ఉన్న మగవాళ్ళు వారు మాత్రమే - మంచు లక్ష్మి

సాధారణంగా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మనం చూస్తూనే ఉంటాం.ఒక్కోసారి కొన్ని వింత ప్రశ్నలు కూడా యాంకర్ సెలబ్రిటీస్ ని అడగడం జరుగుతూ ఉంటుంది.

 Manchu Lakshmi About Her Life , Manchu Lakshmi , Mahesh Babu, Sanjay, Prema Krishna, Manchu Vishnu, Manchu Manoj, Tollywood-TeluguStop.com

అయితే ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉన్న మంచు లక్ష్మి మరొక సెలబ్రిటీ అయిన కృష్ణ కుమార్తె మంజుల ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా ఉంటుంది.కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కాదు అందులో ఒక వింత ప్రశ్న ఒకరికి ఒకరు అడగడం మరింత వింతగా కూడా ఉంటుంది.

ఒక వింత ఎక్స్పీరియన్స్ అలాగే ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

 Manchu Lakshmi About Her Life , Manchu Lakshmi , Mahesh Babu, Sanjay, Prema Krishna, Manchu Vishnu, Manchu Manoj, Tollywood-నా జీవితంలో ఉన్న మగవాళ్ళు వారు మాత్రమే #8211; మంచు లక్ష్మి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల కాలంలో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చాలా కామన్ అయిపోయాయి.

ఇంకా మాత్రమే కాదు సెలబ్రిటీస్ కూడా యాంకర్స్ అవతారం ఎత్తేస్తున్నారు.అలా కృష్ణ కూతురు మంజుల తన యూట్యూబ్ ఛానల్ కోసం మోహన్ బాబు కుమార్తె అయిన ఆరు నటి లక్ష్మి మంచుని ఇంటర్వ్యూ చేయగా దాంట్లో ఒక ఫన్నీ ప్రశ్న లక్ష్మికి ఎదురైంది.

నీ జీవితంలో ఉన్న మగాళ్ళ గురించి, అలాగే వాళ్లలో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పమని మంజుల లక్ష్మిని ప్రశ్నించింది.అందుకు సమాధానంగా తన జీవితంలో కేవలం ముగ్గురే ముగ్గురు మొగ వ్యక్తులు ఉన్నారని అది తన తండ్రి మంచి మోహన్ బాబు అలాగే తన తమ్ముళ్లు అయినా మంచు విష్ణు, మంచు మనోజ్ అంటూ సమాధానం చెప్పింది అంతేకాదు వారి ముగ్గురికి కూడా ఒకే రకమైన క్వాలిటీ అసలు లేవని తెలిపింది.

తన తండ్రి దగ్గర నుంచి ఎలా ఓటమిని అధిగమించాలో నేర్చుకున్నాను అంటూ చెబుతూ తన తమ్ముడు మంచు విష్ణు ఒక గొప్ప తండ్రి అని అలాగే గొప్ప భర్త అంటూ కితాబు ఇచ్చింది.మంచు మనోజ్ విషయానికొస్తే అతడు ఎంత పెద్ద విషయాన్నైనా కూడా అలవోకగా తీసుకుంటాడని ఎలాంటి వారినైనా కూడా తన దగ్గరికి రానిస్తాడంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

Telugu Mahesh Babu, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Prema Krishna, Sanjay, Tollywood-Latest News - Telugu

ఇదే ప్రశ్నని లక్ష్మీ మంజులను తిరిగి ప్రశ్నించగా, కృష్ణ అలాగే తన తమ్ముడు మహేష్ బాబు తన భర్త సంజయ్ గురించి వివరించింది మంజుల.తన తండ్రి ప్రేమ అనంతం వంటిదని, ఎలాంటి షరతులు లేని ప్రేమ కృష్ణ దగ్గర దొరుకుతుందంటూ చెప్పుకొచ్చింది.మహేష్ బాబు ప్రేమ ఎప్పుడూ కూడా బయటకు కనిపించదు అంటూ సముద్రం లాగా తనలో ఎన్నో దాచేసుకుంటాడు అంటూ చెప్పింది.తన భర్త సంజయ్ తనకు ఒక గొప్ప స్నేహితుడు అంటూ మురిసిపోయింది మంజుల.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంచు లక్ష్మీ తన భర్త గురించి ఎలాంటి విషయం కూడా మాట్లాడలేదు దాంతో నటిజన్స్ ఆమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube