మనం ఎప్పుడు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి.మానసిక పరిస్థితి బాగుండాలంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండటమే కాకుండా, అందుకు సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి విషయాల గురించి అయినా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము.మానసిక ఫిట్ నెస్ లో భాగంగా ముందుగా ఐక్యూ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఐక్యూ పెరగాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
మనకు ఐక్యూ స్థాయి పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో మొదటగా పండ్లు, కూరగాయలు ఉంటాయి.తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల మన మెదడు పనితీరు పై ఒత్తిడి తగ్గటంతోపాటు అల్జీమర్స్, పార్కిన్సన్ జబ్బులు వంటి రిస్క్ లు కూడా దూరమవుతాయి.
సాధారణంగా ఎక్కువగా చాక్లెట్స్ తినే వారిని మన పెద్దలు తిడుతూ ఉంటారు.నిజానికి చాక్లెట్స్ తినడం వల్ల ఎంతో ఎనర్జీ కలిగి ఉంటుంది.చాక్లెట్స్ తినడం వల్ల హ్యాపీనెస్ ఏర్పడి బ్రెయిన్ లో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి.వీటిలో డార్క్ చాక్లెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉండే కోకోవా వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది.పసుపు మన భారతదేశంలో వంటలలో ఎంతో విరివిగా వాడుతారు.ఇది వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఔషధగుణాలను మనకు అందిస్తుంది.
ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మన శరీరానికి అందటం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎవరైతే పసుపును ఎక్కువగా వాడుతుంటారో అలాంటి వారి మెదడులో పాజిటివ్ మార్పులు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు.
గ్రీన్ టీ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అందులో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరంలో ఏకాగ్రత జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరుస్తాయి.అంతేకాకుండా విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడంతో మెదడు పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుంది.ఇటువంటి ఆహార పదార్థాలను మనం ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా మనలో ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.