అదితి రావు హైదరి ఈపేరు కొంచం డిఫరెంట్ గా వున్నా ఈమె అచ్చమైన తెలుగింటి అమ్మాయిల ఉండే ఆమే అందం మాత్రం అచ్చమైన తెలుగింటి అమ్మాయిని చూస్తున్నట్టు ఉంది.మణిరత్నం ‘చెలియా‘ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది.అయితే ఆమె తెలుగులో నేరుగా చేసిన చిత్రం మాత్రం.’సమ్మోహనం‘.ఈ సినిమాను మోహన కృష్ఱ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో అదితి రావు నటనకు మంచి మార్కులు పడ్డాయి.సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
వరుణ్ తేజ్ సినిమా ‘అంతరిక్షం 9000 KMPH‘లో నటించిన ఈ భామ ఇటీవల నాని సరసన ‘V’ చిత్రంలో నటించింది.
ఇక అదితి మన తెలంగాణ అమ్మాయి.వనపర్తి సంస్థానంను అదితి కుటుంబ సభ్యులే పరిపాలించారు.ఆమె గ్రాండ్ పేరెంట్స్ వనపర్తి సంస్థానాన్ని ఒకప్పుడు పరిపాలించారు.
ఇక అది అలా ఉంటే టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోనట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా అదితి రావు హైదరి నటించబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది…అజయ్ ఇప్పటికే అదితి రావు హైదరికి కథ కూడా వివరించారు.అదితి రావు హైదరి కూడా ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తిగా ఉందట.
ఈ సినిమాను సుంకర రామబ్రహ్మం ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి తదితరులు నటిస్తున్నారు.
వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది.
ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే.ఈమె 28 అక్టోబర్ 1986న హైదరాబాద్ లో జన్మించింది.స్వతహాగా అదితి అమ్మ అండ్ నాన్న ఇద్దరు కూడా రాజా కుటుంబానికి చెందినవారే.
ఆమె తండ్రి అస్సాంకు చెందిన మహ్మద్ సలెహ్ అక్బర్ హైదరీ రాజలు అయితే ఆమె తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావుకు కుమార్తె అంటే అదితి అక్బర్ హైదరి మునిమనుమరాలు అనమాట.
అంతేకాదు సినీ నిర్మాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు అదితి కజిన్ అవుతుంది.
అలా రాజా కుటుంబానికి చెందిన అదితికి ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.అంతేకాదు అదితి ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది.
ఇంకా ఈమే ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది.ఇక ఆతర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
ఇక ఆతర్వాత నటనమీద వున్నా ఆసక్తితో డిగ్రీ అయిపోయాక సినిమా వైపుకు అడుగులు వేసింది.హిందీ అండ్ తమిళ్ సినిమాల్లో నటించింది.అయితే అదితి గురించి ఎక్కువమందికి తెలియని విషయమేమిటంటే ఈమె 17 ఏళ్ళ వయసులోనే సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ యాక్టర్ తో ప్రేమలో పడి ఇతనితో కొన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉంది.అంతేకాదు అతన్ని 2009 లో మిశ్రా ని పెళ్లి కూడా చేసుకుంది.
అయితే ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు.వీళ్ళకి పెళ్లి జరిగిన నాలుగేళ్లలోనే అంటే 2013 లోనే అతనితో విడాకులు తీసుకుంది.
అప్పటి నుండి అదితి పూర్తి స్థాయిలో సినిమాల మీద ద్రుష్టి సారించి తన కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది.