బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.అప్పటి వరకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే మంచి క్రేజ్ ఉన్న హీరో గా ఉన్న ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయిపోయాడు.
ఇక ఇదే పాపులారిటీని మెయింటెన్ చేస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు ప్రభాస్.ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావటం గమనార్హం.
అంతే కాదు దాదాపు వంద కోట్ల పారితోషికం ప్రభాస్ తీసుకుంటున్నాడు అన్న టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తుంది.
ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఓం రౌత్.
కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఇక వైవిధ్యమైన దర్శకుడు నాగ్ అశ్విన్ లతో వరుసగా ప్రాజెక్టులకు ఓకే చేసేసాడు ప్రభాస్.
ఈ సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతు ఉన్నాయ్.ఇలాంటి సమయంలో ఇప్పటికి పెద్ద హీరోలతో పెద్దగా సినిమాలు తీయని మారుతితో ప్రభాస్ సినిమా ఓకే చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అంటూ టాక్ వినిపిస్తోంది.డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాకి కేవలం 50 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చాడు ప్రభాస్.
దీంతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తున్న ప్రభాస్ స్టార్ హీరోలతో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా మారుతీ లాంటి దర్శకుడితో సినిమా మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది.అయితే దానయ్య తో ఓ సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడట.ఈ క్రమంలోనే మాట ప్రకారమే ఇప్పుడు దానయ్య సినిమాకు ప్రభాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పుడెప్పుడో రాధాకృష్ణ కుమార్కు మాటిచ్చి ఇప్పుడు రాధేశ్యాం చేసినట్లుగానే.దానయ్య కు మాట ఇచ్చిన ప్రకారం మారుతీ తో సినిమాకు సిద్దమయ్యాడు ప్రభాస్.
ఇక ప్రభాస్ కి పారితోషికం గా దానయ్య 75 కోట్లు సింగిల్ పేమెంట్ చేశాడని గుసగుసలు కూడా బయటికి వస్తున్నాయి.ఇక 50 రోజుల డేట్స్ 75 కోట్లు అంటే రోజుకు కోటిన్నర చొప్పున ప్రభాస్ ఛార్జ్ చేస్తున్నాడు అంటూ ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.