తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.అలా చెప్పడం కంటే టాలీవుడ్ టాప్ హీరోలంతా ఇండస్ట్రీ హిట్ కొట్టారని చెప్పవచ్చు.
ఆయా సినిమాల్లో ఉన్న దమ్ము.నటీనటుల అద్భుత నటన మూలంగా పలు సినిమాలు రికార్డులను తిరగరాశాయి.
కనీవినీ ఎరుగని విజయాలు సొంతం చేసుకున్నాయి.అయితే ఆయా హీరోలు ఇండస్ట్రీ హిట్ కొట్టాక.
వారి తదుపరి సినిమాలపై జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటాయి.వాటిని రీచ్ కాలేక ఫ్లాప్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి.
ఒక్కమాటలో చెప్పలంటే ఇండస్ట్రీ హిట్ వచ్చిన తర్వాత ప్రతి హీరో సినిమా పరాజయం పాలైందనే చెప్పుకోవచ్చు.ఇంతకీ టాలీవుడ్ హీరోల ఇండస్ట్రీ హిట్ తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి

చిరంజీవి ఇండస్ట్రీ హిట్ల తర్వాత ఒకటి అర తప్ప చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.పసివాడి ప్రాణం తర్వాత వచ్చిన స్వయంకృషి విజయం సాధించింది.అనంతరం యముడికి మొగుడు తర్వాత ఖైదీ నెం.786 సూపర్ హిట్ కొట్టింది.అత్తకుయముడు అమ్మాయికి మొగుడు తర్వాత స్టేట్ రౌడీ ఫర్వాలేదు అనిపించింది.జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత కొదమసింహం విజయం సాధించింది.గ్యాంగ్ లీడర్ తర్వాత రౌడీ అల్లుడు బ్లాక్ బస్టర్ సాధించింది.ఘరానామొగుడు తర్వాత ఆపద్భాందవుడు డిజాస్టర్ అయ్యింది.
ఇంద్ర తర్వాత వచ్చిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ కొట్టింది.ఖైదీ నెంబర్ 150 విజయం తర్వాత సైరా కూడా సక్సెస్ అయ్యింది.
బాలకృష్ణ

ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత అశోక చక్రవర్తి సినిమా ఫ్లాప్ కొట్టింది.సమరసింహారెడ్డి తర్వాత సుల్తాన్ సైతం పరాజయాన్ని చవిచూసింది.అటు నరసింహానాయుడు తర్వాత భలేవాడివి బాసు కూడా డిజాస్టర్ అయ్యింది.
వెంకటేశ్

వెంకటేష్ నటించిన కలిసుందాం.రా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఆ తర్వాత వచ్చిన మనదేరా కూడా విజయం సాధించింది.
మోహన్ బాబు

డైలాగ్ కింగ్ నటించిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఆ తర్వాత వచ్చిన సోగ్గాడి పెళ్లాం మూవీ పరాజయం పాలైంది.
పవన్ కల్యాణ్

ఖుషి తర్వాత వచ్చిన జానీ డిజాస్టర్ గా నిలిచింది.అత్తారింటికి దారేది తర్వాత గోపాల గోపాల ఫర్వాలేదు అనిపించింది.
మహేశ్ బాబు

పోకిరి తర్వాత సైనికుడు.శ్రీమంతుడు తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్లుగా నిలిచాయి.
రామ్ చరణ్

మగధీర తర్వాత ఆరెంజ్, రంగస్థలం తర్వాత వినయ విధేయ రామ బోల్తా కొట్టాయి.
ప్రభాస్

బాహుబలి తర్వాత వచ్చిన సాహో డిజాస్టర్ అయ్యింది.