మన శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ ఎంతో అవసరం.కానీ కొలెస్ట్రాల్ లోనే రెండు రకాలు ఉంటాయి.
ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే.మరొకటి చెడు కొలెస్ట్రాల్.
ఈ చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ) పెరగడం వల్ల గుండెకు ముప్పు పెరుగుతుంది.ఊబకాయం బారిన పడతారు.
టైప్ 2 డయాబెటిస్, హై బీపీ.ఇలా ఎన్నో జబ్బులు తలెత్తుతుంటాయి.
అందుకే మనకు చెడు చేసే బాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించుకోవాలి.అదెలా అని భయమొద్దు.
ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగించుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కీరా దోసకాయ( Cucumber ) ముక్కలు, ఒక కప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు, మూడు స్పూన్లు తరిగిన కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ గ్రీన్ జ్యూస్ లో చిటికెడు మిరియాల పొడి కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ ను కరిగించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఈ జ్యూస్ రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది.బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతుంది.
బాడీని డీటాక్స్ చేస్తుంది.అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ గ్రీన్ జ్యూస్ ను డైలీ డైట్ లో చేర్చుకోండి.
అలాగే నిత్యం అరగంట వ్యాయామం చేయండి.ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.
మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోండి.తద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా దూరం అవుతుంది.