మెగాస్టార్ చిరంజీవి సురేఖల ( Chiranjeevi,Surekha ) కు ముగ్గురు పిల్లలు.అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే సుస్మిత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వర్క్ లోనే బిజీగా ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో తండ్రి తో కలిసి ఓ సినిమాకి నిర్మాతగా చేయబోతున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ అది జరగలేదు.ఇక శ్రీజ ( Sreeja ) ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను మొదట్లో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలి అని భావించారట.అంతేకాదు అప్పట్లో ఉదయ్ కిరణ్( Uday Kiran ) హీరోగా సుస్మితను హీరోయిన్ గా పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా కూడా తీయాలని కథ రెడీ చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి కాంబినేషన్లో సినిమా తెరకెక్క లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సుస్మిత ( Susmitha ) అప్పట్లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుందని మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో అప్పట్లో ఉండే ఓ టాలీవుడ్ హీరో సుస్మిత నెంబర్ కనుక్కొని ఆమెకు మెసేజ్లు చేస్తూ తన సినిమాలో హీరోయిన్( Heroine ) గా చేయమని చెప్పారట.అంతేకాదు అర్ధరాత్రి కూడా ఆమెను వదలకుండా ఏదో ఒక మెసేజ్ చేస్తూ విసిగించేవాడట.కానీ బయట ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుంది అనే ఉద్దేశంతో సుస్మిత ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేదట.అయితే ఆ టాలీవుడ్ హీరో చేసే మెసేజ్లు రోజురోజుకి హద్దులు మీరడంతో ఏం చేయాలో తెలియక సుస్మిత ఏకంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) దగ్గరికి వెళ్లి తన ఫోన్ ఇచ్చి ఆ మెసేజ్లు చూపిస్తూ రోజు టార్చర్ చేస్తున్నాడు అని చెప్పిందట.
దాంతో తమ ఫ్యామిలీ జోలికి వస్తే క్షణం కూడా ఆలోచించని పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ హీరో ఇంటికి వెళ్లి నా కూతురికి అలాంటి మెసేజ్లు చేస్తావా అని చితక్కొట్టాడట.దాంతో భయపడిపోయిన ఆ హీరో ఇంటికి వెళ్లి మరీ సుస్మిత కు క్షమాపణలు చెప్పారట.ఇక ఆ హీరో ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పేవరకు కూడా హీరో టార్చర్ చేశారని ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదట.ఇక అప్పట్లో ఈ విషయం మీడియాలో చాలా వైరల్ అయింది.