పొగ తాగడం హానికరం.ఆరోగ్యానికి ప్రమాదం అని ఎన్ని సార్లు చెప్పిన సరే మనుషులు మారారు.
ఎంత చెప్పిన మారారు.ఏదో చిన్నతనం సరదా అని మొదలు పెడుతారు.
రోజుకి ఒకటి లేదా రెండు ఏ కదా అని రోజు రోజుకు ఎక్కువగా తాగేస్తారు.ఇంకా అలా తాగుతూ తాగుతూ ఒక రోజు శాశ్వతంగా మంచాన పాడుతారు.
సిగరెట్లు తాగే కొద్దీ వారి ఆయుష్షు కూడా ఈజీగా తగ్గుతూ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ధూమపానం చెయ్యడం వల్ల శరీరకంగా నష్టపోవడం మాత్రమే కాకుండా మానసికంగా నష్టపోతారని పరిశోధకులు చేసిన సర్వేలో బయట పడింది.
దూమపానం చేసే వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.
ఈ విషయం ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన సర్వేలో బయటపడింది.
ఈ సర్వ్ కోసం 1,52,483 మంది రోగులను సందర్శించారు.దూమపానం చెయ్యని వారితో పోలిస్తే 30 శాతం అధికంగా రోగాల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు.
అంతేకాదు ధూమపానం చెయ్యడం వల్ల 10 ఏళ్ల ముందే మరణిస్తారట.అందుకే సిగరెట్లు, బీడీలు తాగడం మానేసి ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోండి.
ఆనందంగా ఉండండి.