టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గౌతమ్ మీనన్ (Gautham Menon)దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే (Yem Maya Chesave)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సమంత నాగచైతన్య(Nagachaitanya) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
సమంత కెరియర్ లోనే మొట్టమొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో ఎంతో మంచి అవకాశాలు వచ్చాయి.ఇక ఈ సినిమా సమయంలో నాగచైతన్యతో కలిసి నటించిన ఈమె అనంతరం చైతు ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవడం జరిగింది.
పెళ్లి తర్వాత వీరిద్దరూ కొంతకాలం సంతోషంగా ఉన్న అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య (Samantha, Naga Chaitanya)విడిపోయినప్పటికీ తరచు వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.అయితే ఇటీవల సమంత తన సినిమాల గురించి అందులో నటించిన పాత్రల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది.
ఇది చాలా ఎక్కువ టైం.కెరీర్ మొదట్లో నేను చేసిన సినిమాల్లో నా యాక్టింగ్ చూసి ఇంత చెత్తగా నటించానా అనుకుంటూ ఉంటానని తెలిపారు.కెరియర్ మొదట్లో నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు భాష కూడా పెద్దగా వచ్చేది కాదని సమంత తెలిపారు.

ఇండస్ట్రీకి తనకు కొత్త కావడంతో కెరియర్ మొదట్లో గ్లామర్ పాత్రలలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని సమంత గుర్తు చేసుకున్నారు.నా మొదటి సినిమా మాస్కో కావేరి రాహుల్ రవీంద్రన్ తో కలిసి చేశాను.ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అనంతరం ఏం మాయ చేసావే సినిమా ద్వారా మీ ముందుకు వచ్చానని తెలిపారు.
ఏ మాయ చేసావే సినిమాకు సంబంధించి ప్రతి సీన్, ప్రతి షాట్ నాకు గుర్తుంది.కార్తీక్ ని గేట్ దగ్గర కలిసే షాట్ నా మొదటి షాట్.
గౌతమ్ మీనన్ గారు ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు.నా ఈ మొదటి సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమని తెలిపారు.
ఈ 15 సంవత్సరాల సినీ కెరియర్లో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను అంటూ సమంత కెరియర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







