ప్రముఖ సింగర్ కల్పన ( Singer kalpana ) ఆత్మహత్య గురించి సోషల్ మీడియా వేదికగా ఒకింత చర్చ జరిగిన సంగతి తెలిసిందే.కల్పనకు భర్తతో గొడవలు ఉన్నాయని మొదట వార్తలు రాగా కూతురుతో గొడవలు ఉన్నాయని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.
అయితే కల్పన కూతురు వెర్షన్ మాత్రం భిన్నంగా ఉంది.నా తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కల్పన కూతురు అన్నారు.
డాక్టర్ల సూచనలను అనుసరించి తన తల్లి జోల్ ఫ్రెష్ మాత్రలు వేసుకుందని మాత్రలు మోతాదు మించడంతో అపస్మరక స్థితిలోకి చేరుకుందని ఆమె చెప్పుకొచ్చారు.మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని హైదరాబాద్ లో మా అమ్మ లా పీజీ చేస్తోందని మానసిక ఒత్తిడి వల్ల అమ్మ తరచూ నిద్రలేమికి గురవుతూ ఉంటోందని కల్పన కూతురు చెబుతుండటం గమనార్హం.

అయితే కల్పన కూతురు చేసిన కామెంట్ల విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కల్పన మోతాదుకు మించి మాత్రలు ఎందుకు తీసుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సింగర్ కల్పన వయస్సు 44 సంవత్సరాలు కాగా ఆమె కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.కల్పన కాల్ హిస్టరీ చెక్ చేస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

కల్పన పూర్తిస్థాయిలో మెలుకువలోకి వస్తే మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది.డబ్బింగ్ ఆర్టిస్ట్ ( Dubbing artist )గా కూడా కల్పన ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.కల్పన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.కల్పన ఇలా చేయడం తప్పు కాదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.కల్పన కుటుంబ సభ్యులు ఏదో దాస్తున్నారని కూడా మరి కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.కల్పన డిప్రెషన్ లో ఉండటానికి అసలు కారణాలు ఏంటనే అభిప్రాయాలు సైతం వక్తం అవుతుండటం గమనార్హం.







