టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ( Anirudh )ఒకరనే సంగతి తెలిసిందే.అనిరుధ్ తన సినీ కెరీర్ లో మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) గా ఎన్నో విజయాలను అందుకున్నారు.
దేవర సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ , బీజీఎం ఆ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యాయి.నాని ది ప్యారడైజ్ సినిమాకు( The Paradise ) కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు అనిరుధ్ రెమ్యునరేషన్ తెలిసి నెటిజన్లు ఒకింత షాకవుతున్నారు.
ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా 15 కోట్ల రూపాయలు ఛార్జ్( 15 crore charge ) చేస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి తెలుగులో 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించవచ్చు.అయితే అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే పాన్ ఇండియా స్థాయిలో ది ప్యారడైజ్ సినిమాకు గుర్తింపు వస్తుంది కాబట్టి ఈ మ్యూజిక్ డైరెక్టర్ నే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

అనిరుధ్ ఈ సినిమాకు సాంగ్స్, బీజీఎం ఏ రేంజ్ లో ఇస్తారో చూడాలి.ఈ మధ్య కాలంలో అనిరుధ్ సైతం నిరాశపరిచిన కొన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమాతో ఏం జరుగుతుందో చూడాలి.మరోవైపు ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి.ఈ సినిమా గ్లింప్స్ లో బూతుల డోస్ ఎక్కువైందని నెటిజన్లు రియాక్ట్ కావడం జరిగింది.

నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ ది ప్యారడైజ్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది.2026 సంవత్సరం శ్రీరామనవమి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.నాని తర్వాత సినిమాలతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.







