పెళ్లిలో చేసే పదహారు హోమాలకి అర్థం ఏమిటి?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి క్రతువులో హోమాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఇలా హోమాలు చేసి పెళ్లి క్రతువు నడిపించే వారు మొత్తం పదహారు హోమాలు చేస్తారు.

 What Is The Meaning Of Sixteen Homas Performed At The Wedding , Homalu, Importan-TeluguStop.com

అయితే ఇలా చేసే ఆ పదహారు ఆజ్యహోమాలకి అర్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి హోమం వధువుని తొలుత పొందిన చంద్రునకు ఆహుతి దత్తం చేస్తారు.

ఆపై గంధర్వునకూ, అగ్ని హోత్రునకూ ఆహుతి దత్తం చేస్తారు.నాలుగో హోమం పితృ గృహం నుంచి భర్త గృహానికి పోవడానికి కన్యకా దీక్షను వదిలివేసినందుకు… ఆపై హోమం పితృ కులం వదలేసినట్లు భర్త కులాన్ని వదలకుండా ఉండేందుకు చేయిస్తారు.

అలాగే ఆరవ హోమం ఇంద్రునికై సౌభాగ్య వతిగా సుపుత్రవతిగా చేయమని.ఆపై ఏడో హోమం అగ్ని దేవుడి గూర్చి వధువుకి కల్గిన సంతానాన్ని మృత్యువు నుంచి సదా రక్షించమని వధువుకి భవిష్యత్తులో పుత్ర శోకం కల్గనీయ వద్దని చేస్తారు.

ఎనిమిదోది ఆజ్య హోమం కల్గిన సంతానానికి సంపూర్ణ ఆయుష్షు నిచ్చి ఆమెను సంతోషంగా ఉంచమని.తొమ్మిదో ఆజ్య హోమం శోకం దరిచేరకుండా, కన్నీరు కార్కకుండా భర్త, బిడ్డలను చూసుకుంటూ పరిపూర్ణ సంతోషం పందాలని.

పదవ హోమం వధువు మెడను నింగీ, వాయు దేవుడు, ఊరువులను, ఎదునూ అశ్వనీదేవతలూ, పుట్టబోయే సంతానాన్ని భానుడూ, ధరించిన వస్త్రాలను బృహస్పతీ, వెనుక భాగాన్ని దేవతలూ రక్షించాలని.

పదకొండవ హోమం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించమని, వాటి నుంచి కల్గే దుఃఖాన్ని పోగట్టమని.

అలాగే పన్నెండవ హోమం వరుణ దేవుడి కోసం, చల్లగా కాపాడమని.పదమూడో హోమం వరుణుడ్ని ప్రార్థించటం.సమస్త కుటుంబ ఆయుర్ధాయమును బంఘ పరచకుండా, కోపం లేకుండా ప్రార్థనలని వినమని.పద్నాలుగోది అగ్ని హోత్రుడికై.

పదిహేనవది దేవతలతో తొలి వాడైన అగ్నిదేవుడిని మా యజ్ఞయాగాదులందు హవిస్సుభుజించి ఆపై కోరికలు నెరవేర్చాలని… చివరగా పదహారవది హోమం అగ్నిహోత్రునికి మనసా వాచా ధ్యానిచి పూజించ నమస్కరించటం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube