ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతులను ప్రభుత్వం మోసగిస్తోందన్నారు.
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదని ఆరోపించారు.
తరుగు పేరుతో రైతుల నుంచి రైస్ మిల్లర్లు దోచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.
మిల్లర్లు దోచుకున్న మొత్తాన్ని తిరిగి రైతులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ధాన్యం సేకరణపై ఏ రైతు సంతృప్తిగా లేరని చెప్పారు.
కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించారని విమర్శించారు.సీఎం జగన్ అసమర్థ విధానాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతులు వలసపోతున్నారన్నారు.
రైతులకు తుపాను వల్ల కాదు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.