ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలకు సంబంధించిన అనేక యాప్ లను చాలామంది వినియోగదారులు ఎప్పటికప్పుడు వినియోగిస్తూనే ఉంటారు.
అందులో ప్రధానమైనది గూగుల్ మ్యాప్స్(Google Maps).ప్రధాన నగరాలలో, రహదారులలో దారి తెలియక ఇబ్బంది పడే వారికి ఈ గూగుల్ మ్యాప్స్ ఒక సరైన సమాధానం అని చెప్పాలి.
కానీ ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ప్రయాణం మొదలవుతే మాత్రం అనుకోని ఇబ్బందులు కూడా తలెత్తుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇక ముఖ్యంగా రాత్రి వేళ గూగుల్ మ్యాప్స్ ను అమ్ముకొని కొండల్లోనూ, కోనల్లోనూ ప్రయాణం చేసే వారికి అతి పెద్ద ప్రమాదం అనే చెప్పాలి.

అయితే, తాజాగా ఒక డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకొని వెళ్లి చిక్కులలో పడ్డాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే.కర్ణాటక రాష్ట్రం( Karnataka State) నుంచి తాడిపత్రికి ఐరన్ లోడ్ (Iron load ,Tadipatri)తో డ్రైవర్ ఫరూక్ బయలుదేరాడు.కానీ, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్స్ ను ఆన్ చేసి ప్రయాణం మొదలుపెట్టాడు.
ఆ మ్యాప్ లో ఫాలో అయిపోయాడు.అది చివరికి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండలలోకి తీసుకొని వెళ్ళింది.
ఈ క్రమంలో ఆ కొండలలో లోయలో చిక్కుకొని ఒరిగిపోయింది.దీంతో ఆ డ్రైవర్ విషయాన్ని యజమానికి తెలియజేయగా చివరికి జెసిబిల సహాయంతో ఆ భారీ కంటైనర్ ను బయటకు తీశారు.
ఈ సంఘటన చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే ఇలానే ఉంటుంది అని కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు అయ్యో పాపం ఆ డ్రైవర్ పరిస్థితి తలుచుకుంటూనే పాపం అనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.