వంట పడక గదులలో ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే మాత్రం..?

వాస్తు శాస్త్రం( Vastu ) ప్రకారం ఇంటి నిర్మాణశైలి అలాగే ఇంట్లో ఉంచే వస్తువులు, చెట్లు అన్ని వాస్తు ప్రకారం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని వాస్తు శాస్త్రంలో ఉంది.వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది.

 Follow These Vastu Tips In Kitchen And Bedroom To Get Rid Of Financial Problems-TeluguStop.com

అలాంటి ఇంట్లో నివసించే వారి జీవితం చాలా సానుకూలంగా, సాఫీగా సాగుతూ ఉంటుంది.ఏ దిక్కులో ఎలాంటి వస్తువులు ఉంచాలో, ఎలాంటి వస్తువులను ఏ దిక్కులో ఉంచకూడదో కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Telugu Bedroom, Bedroom Vastu, Problems, Kitchen, Kitchen Vastu, Lakshmi Devi, V

కొన్నిసార్లు వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో( Home ) కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి.చేతిలో డబ్బు నిలువకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత్యం లేకపోవడం,దంపతుల మధ్య తరచు కలహాలు లాంటివి జరుగుతూ ఉంటాయి.కొన్ని వస్తువులను వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా ఉంచడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.అలాగే వాసు శాస్త్రం ప్రకారం వంట, పడకగదులలో కొన్ని పనుల చేయడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి.

మరి పడక, వంట గదులలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bedroom, Bedroom Vastu, Problems, Kitchen, Kitchen Vastu, Lakshmi Devi, V

పడకగది( Bedroom ) అంటే దంపతులకు చెందినది.సన్నిహిత్యాన్ని పెంపొందించే గది ఇది.అలాంటి గదిలో వివిధ పనులు చేయడం వల్ల అందులోని సానుకూల శక్తిని మనమే బయటకు వెళ్లగొట్టిన వాళ్ళం అవుతాం.కొందరు డైనింగ్ టేబుల్ వద్ద హాల్ లో కూర్చొని భోజనం చేయకుండా పడగదిలో వెళ్లి భోజనం చేస్తుంటారు.ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.దీని వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.అలాగే బెడ్రూంలో ఎంగిలి ప్లేట్లను అస్సలు ఉంచకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే వంటగదిలో( Kitchen ) భోజనం వండుకోవాలి.కానీ భోజనం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వండిన వంటకాలు తినాలనుకుంటే ప్లేట్లో పెట్టుకుని బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ పై లేదా హాలు లో కూర్చొని తినాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube