ఈ పొడిని ప్ర‌తి రోజు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌కి గుడ్‌బై చెప్పొచ్చు!

బెల్లి ఫ్యాట్‌దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రినో తీవ్రంగా వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

 How To Get Rid Of Belly Fat At Home! Belly Fat, Latest News, Health Tips, Good H-TeluguStop.com

ఫ్యాటీ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, జీవ‌న శైలిలో చోటుచేసుకున్న మార్పులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌టం, ఒకే చోట గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది.దాంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బాన పొట్ట‌లా త‌యారు అవుతుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే పొడిని ప్ర‌తి రోజు తీసుకుంటే పొట్ట ఎంత లావుగా ఉన్నా స‌న్న‌గా మార‌డం ఖాయం.మ‌రి లేటెందుకు ఆ పొడి ఏంటో, దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

ముందుగా స్ట‌వ్ ఆన్ ప్యాన్ పెట్టుకుని ఒక క‌ప్పు అవిసె గింజ‌లు వేసి.స్లో ఫ్లేమ్‌పై స్లైట్‌గా వేయించుకోవాలి.ఆ త‌ర్వాత అవిసె గింజ‌ల‌ను ప‌క్క‌కు తీసి అదే ప్యాన్‌లో గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను వేయించాలి./br>

Telugu Belly Fat, Tips, Remedy, Latest-Telugu Health Tips

వేరుశెన‌గ‌లు వేగిన త‌ర్వాత వాటిని ప‌క్క‌కు తీసి.మ‌ళ్లీ అదే ప్యాన్‌లో రెండు స్పూన్ల ప‌చ్చి శెన‌గ‌ప‌ప్పు, రెండు స్పూన్ల ధ‌నియాలు, రెండు స్పూన్ల మిన‌ప‌ప్పు, వ‌న్ స్పూన్ జీల‌క‌ర్ర‌, ప‌ది ఎండు మిర్చీలు, గుప్పెడు క‌ర‌విపేకు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న దినుసులు, వేరుశెన‌గ‌లు, అవిసెగింజ‌లు, కొద్దిగా చింత‌పండు, నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు, ఒక స్పూన్ న‌ల్ల ఉప్పు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఆపై ఈ పొడిని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకుంటే ప‌ది నుంచి ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ఈ పొడిని అర స్పూన్ చ‌ప్పున రైస్‌తో క‌లిపి తీసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వంతా క్ర‌మంగా క‌రిగిపోతుంది.దాంతో బెల్లీ ఫ్యాట్‌కి మీరు గుడ్‌బై చెప్పేయ‌వ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube