ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం:మ .12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 సా.2.00 ల4.00
దుర్ముహూర్తం: ఉ .11.57 మ.12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు మొదలవుతాయి.
వృషభం:
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.తోటి వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.సమయాన్ని వృధా చేయకండి.
మిథునం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోకపోవడం మంచిది.ఉద్యోగ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.గొడవలకు దూరంగా ఉండడం మంచిది.మనోధర్యంతో చేపట్టిన పనిలో విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృధా ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.
కన్య:
ఈరోజు మీరు బంధువులతో ఆచితూచి మాట్లాడాలి.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.స్నేహితుల నుండి మంచి మాటలు ఉంటారు.తోబుట్టులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులా:
ఈరోజు మీకు శ్రమకు తగ్గిన ఫలం దొరుకుతుంది.ఎంతో కాలం నుండి ఉన్న కోర్టు సమస్యల నుండి బయట పడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
అనవసరమైన విషయాలకు సతమతమవుతారు.కొందరి వ్యక్తుల ద్వారా మంచి సమాచారం పొందుతారు.
వృశ్చికం:
ఈరోజు మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు తలపెట్టిన పనుల్లో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదురు కుంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఎంతో బాధ పెడతారు.విద్యార్థులలు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు సంతాన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం వలన మంచి జరుగుతుంది.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కుంభం:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దేవదర్శనం చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.
వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు ఉంటారు.దానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.
మీనం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.తరచూ మీ ఆలోచనలు మారడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.చేసే పనుల్లో నిలకడగా ఉండడం మంచిది.