ఏడాదిన్నర వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

చాలా మంది పిల్లలకు ఏడాదిన్నర వయసు అంటే సరిగ్గా మాటలు కూడా రావు.వారు పలికే ముద్దు ముద్దు మాటలు సరిగ్గా లేకున్నా చాలా మంది ఆనందిస్తారు.

 Kadapa District Girl Harnika Creates India Book Of Records By Memorizing Animals-TeluguStop.com

తల్లిదండ్రులైతే తమ పిల్లల మాటలకు మురిసి పోతారు.వాటిని వీడియోలు తీసి, మిగిలిన బంధువులకు చూపిస్తుంటారు.

ఆ వయసులో నడక నేర్చుకోవడం, కొద్దికొద్దిగా మాటలు నేర్చుకోవడం వంటి లక్షణాలు సహజం.అయితే ఏడాదిన్నర వయసులో ఓ చిన్నారి పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

అతి కొద్ది సమయంలోనే ఎన్నో జంతువులను గుర్తు పట్టి వాటి పేర్లు చెబుతోంది.అంతేకాదండోయ్.

పక్షులు, జంతువులు అరిచే అరుపులు ఎలా ఉంటాయో అనుకరించి మరీ చెబుతోంది.పిట్టకొంచెం కూత ఘనం అనే నానుడిని నిజం చేస్తోంది.

తాజాగా ఆమెకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

ఏపీలోని కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగజ్యోతికి, రాజంపేట వాసి చదవాల భానుప్రకాష్‌తో కొన్నేళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు.

మంచి ఉద్యోగాలు రావడంతో వారు అమెరికాలో స్థిరపడ్డారు.వారికి ముద్దులొలికే ఇద్దరు కవల అమ్మాయిలు పుట్టారు.వారిలో ఒకరు హార్ణిక. ఆమె వయసు ప్రస్తుతం 1 సంవత్సరం 8 నెలల 24 రోజులు మాత్రమే.అయితే 24 జంతువుల పేర్లను టకటకా చెప్పేస్తోంది.

Telugu Bhanu Prakash, Harnika, India, Kadapa, Animals Names, Naga Jyothi, Latest

ఈ చిన్నారి ప్రతిభకు మెచ్చిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.ఆమె తల్లిదండ్రులతో కలిసి జనవరి 10న ఇండియాకు వచ్చింది.ఆ సమయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చిన్నారి ప్రతిభను పరీక్షించారు.

తాజాగా మెడల్, సర్టిఫికెట్‌ను పంపించారు.వాటిని తిరిగి అమెరికా వెళ్లిపోయిన హార్నిక తల్లిదండ్రులకు పంపించారు.

ఈ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube