ఎలాంటి మచ్చ లేకుండా ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మం పొందడంలో ఎక్కువ శాతం మంది విఫలం అవుతూ ఉంటారు.
మీరు ఈ లిస్ట్ లోనే ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ జెల్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ జెల్ ను ప్రతిరోజు నైట్ ముఖానికి రాసుకుంటే స్పాట్ లెస్ గ్లోయింగ్ స్కిన్( Glowing skin ) మీ సొంతం అవ్వాల్సిందే.మరి ఇంతకీ ఆ మిరాకిల్ జెల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ( Beet root )ను తీసుకొని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత వాటర్ ను మాత్రం స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ( Sweet almonds )వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన మిరాకిల్ జెల్ సిద్ధం అవుతుంది.ఈ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న జెల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే మాయం అవుతాయి.
మొటిమలు ( pimples )రావడం తగ్గుముఖం పడతాయి. స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.ఫైనల్ గా కొద్ది రోజుల్లోనే స్పాట్ లెస్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.







