స్వీప్‌- అకౌంట్‌ ఏమిటి? ఫిక్సెడ్ డిపాజిట్ మీద వడ్డీ తీసుకోవచ్చా?

మన దేశంలో దాదాపు జనాభాకి పొదుపు ఖాతా వుందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వ్యాపారస్తులు సాధారణంగా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు.

 What Is A Sweep Account? Can Interest Be Taken On Fixed Deposit , Sweep Account-TeluguStop.com

సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్ మీద పెద్దగా వడ్డీ రాదనే విషయం అందరికీ తెలిసినదే.అదే డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ ( FD ) చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

పొదుపు/కరెంట్ ఖాతాలపై ఎక్కువ వడ్డీ రాకపోయినా, అందులో ఉన్న డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు.అయితే ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్లో ఎక్కువ వడ్డీ వచ్చినా, నిర్దిష్ట సమయం వరకు అందులో డబ్బును వెనక్కు తీసుకోవడం వీలు పడదు.

దాదాపుగా ఈ విషయాలన్నీ అందరికీ తెలిసే వుంటుంది.

Telugu Credit, Fixed Deposit, Intrest, Moeny, Process, Sweep-Latest News - Telug

అయితే పొదుపు/కరెంట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లోని బెనిఫిట్స్ మాత్రమే కలిపే ఒక అద్భుతమైన ఫీచర్ ని ఇపుడు బ్యాంకులు రన్ చేస్తున్నాయి, చాలా మందికి ఈ విషయం తెలీదు.అదే స్వీప్ ఇన్ ( Sweep-in ) ఫీచర్.ఈ ఫెసిలిటీతో అకౌంట్లోని డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, పైగా ఫిక్సెడ్ డిపాజిట్ తరహా వడ్డీని కూడా ఇక్కడ పొందొచ్చు.స్వీప్ ఇన్ ఫీచర్, మీ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలోని అదనంగా ఉన్న డబ్బును ఫిక్సెడ్ డిపాజిట్ లాగా మారుస్తుంది.ఉదాహరణకు… మీ నెలవారీ ఖర్చులు పోను మరికొంత మొత్తం బ్యాంక్ అకౌంట్లో మిగులుతుందని అనుకుంటే, ఇలా మిగిలే డబ్బును అదే అకౌంట్లో ఉంచితే బ్యాంకు మీకు నామమాత్రపు వడ్డీని చెల్లిస్తుంది.దీనిపై మంచి వడ్డీ రాబట్టుకోవడానికి స్వీప్ ఇన్ ఫీచర్ వాడుకోవచ్చన్నమాట.

Telugu Credit, Fixed Deposit, Intrest, Moeny, Process, Sweep-Latest News - Telug

ఇపుడు మీ నెల శాలరీ రూ.50 వేలు అనుకుంటే, మీరు స్వీప్ ఇన్ ఫీచర్ కింద మీ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో 50 వేల రూపాయల పరిమితిని పెట్టారు.ఇప్పుడు మీ అకౌంట్ 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు మిగిలి ఉంటే, అది ఫిక్సెడ్ డిపాజిట్ అవుతుందన్నమాట.

ఈ అదనపు డబ్బు మీద అధిక వడ్డీ లభిస్తుంది.ఇక స్వీప్ ఇన్ ఫీచర్తో ఎలాంటి సమస్య ఉండదు.మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, మీరు ఈ ఫిక్సెడ్ డిపాజిట్ నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.తర్వాత దాన్ని తిరిగి ఫిల్ చేయవచ్చు.

నిర్ణీత గడువులోగా ఆ డబ్బును తిరిగి డిపాజిట్ చేయాలి.దీనివల్ల మీకు ఎలాంటి ఫైన్ పడదు, ఎఫ్డీ ప్రయోజనం ఏ మాత్రం తగ్గదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube