మధుమేహానికి ఒత్తిడికి ఉన్న సంబంధం గురించి తెలుసా..?

ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాపించే వివిధ రకాల వ్యాధులలో డయాబెటిస్ కచ్చితంగా ఉంటుంది.చెడు ఆహారపు అలవాట్లు, పని వేళలు, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి( Stress ) ఇలా అన్ని మధుమేహం వ్యాధికి కారణం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

 Do You Know About The Relationship Between Stress And Diabetes? Diabetes ,stress-TeluguStop.com

వీటన్నింటితో పాటు మానసిక కారణాలు కూడా డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు.నిద్ర సరిగ్గా లేక, పని ఒత్తిడి లేదా ఇతర కుటుంబ పరమైన సమస్యలు, ఇలా మానసికంగా పడే ఇబ్బందులు మధుమేహానికి దారి తీస్తున్నాయి.

మానసిక సమస్యల కారణంగా ఆందోళన,ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలవుతుంటాయి.ఈ హార్మోన్లు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెరిగేలా చేస్తాయి.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.శరీరంలో కనిపించే ప్రతిక్రియల్ని ఫ్లైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తారు.

ఫలితంగా మీ రక్త సరఫరాలో అడ్రినలిన్, కార్టిసోల్ విడుదలవుతాయి.ఫలితంగా రెస్పిరేటరీ రేట్ పెరిగి రక్తం లోని చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.

Telugu Cortisol, Headache, Tips, Stress, Muscle Pain-Telugu Health Tips

ఒత్తిడి అనేది వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది.టైప్2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు( Diabetes ) మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు షుగర్ కూడా పెరగవచ్చు.ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ ను ట్రాక్ చేయాల్సి ఉంటుంది.ఇలా చేయడం ద్వారా మధుమేహం పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

Telugu Cortisol, Headache, Tips, Stress, Muscle Pain-Telugu Health Tips

పని ఒత్తిడి కారణంగా సోమవారం వస్తే చాలు మందిలో ఒత్తిడి పెరిగిపోతుంది.ఒత్తిడికి లోనైనా ప్రతిసారి డయాబెటిస్ చెక్ చేసుకుంటే రెండిటికి ఉన్న సంబంధం ఏంటో తెలిసిపోతుంది.చాలా సందర్భాల్లో ఒత్తిడి లక్షణాలు సామాన్యంగానే ఉంటాయి.

అది ఒత్తిడి అని కూడా మీకు అనిపించకపోవచ్చు.చాలామందిలో ఒత్తిడి లక్షణాలు విభిన్నంగా ఉంటాయి.

తలనొప్పి, కండరాల్లో నొప్పి( Headache ), ఎక్కువగా లేదా తక్కువగా నిద్రపోవడం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం, అలసట, నీరసం, విసుగు, అశాంతి అనేది ఒత్తిడిలో కనిపించే ప్రధాన లక్షణాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube