సాధారణంగా కొందరికి శరీరం ఎంత తెల్లగా ఉన్నాచేతులు మాత్రం డార్క్‌గా, రఫ్‌గా ఉంటాయి.ఈ క్రమంలోనే చేతులను మృదువుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీములు, మాయిశ్చరైజర్లు, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే ఎలాంటి ఖర్చు లేకుండా అందరి వంటింట్లో ఉండే చింత పండుతో కూడా చేతులును మృదువుగా మార్చుకోవచ్చు.
మరి చింత పండును చేతులకు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా వాటర్‌లో చింతపండును నాన బెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మ రసం వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు డ్రైఅవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చేతులు మృదువుగా, వైట్‌గా మారతాయి.
ఇక ఒక గిన్నెలో రెండు స్పూన్ల చింత పండు గుజ్జు, ఒక స్పూన్ల బియ్యం పిండి, అర స్పూన్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చేతులకు బాగా రుద్దుకుని కాస్త ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.వారంలో నాలుగు లేదా ఐదు సార్లు ఇలా చేసినా కూడా చేతులు మృదువుగా, కాంతి వంతంగా మారతాయి.