Anemia : రక్తహీనతను వేగంగా తరిమికొట్టే టాప్-3 జ్యూస్ లు.. ఇవి డైట్ లో ఉంటే ఇక మీకు తిరుగే ఉండదు!

రక్తహీనత( Anemia ) ప్రస్తుత రోజుల్లో పిల్లల‌ నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.రక్తహీనత అనేది పెద్ద వ్యాధి కానప్పటికీ.

 Top 3 Juices To Get Rid Of Anemia Quickly-TeluguStop.com

‌.దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు గా మారుతుంది.ఈ నేపథ్యంలోనే రక్తహీనతను వేగంగా తరిమికొట్టే టాప్ 3 జ్యూసులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పైనాపిల్ పాలక్ జ్యూస్.రక్తహీనత బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.బ్లెండర్ లో ఒక కప్పు పైనాపిల్( Pineapple ) ముక్కలు, నాలుగు పాలకూర ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

చివరిగా రెండు స్పూన్లు తేనె కలిపితే పైనాపిల్ పాలక్‌ జ్యూస్ రెడీ అవుతుంది.ఈ జ్యూస్ లో ఐరన్ తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత వేగంగా దూరమవుతుంది.అదే సమయంలో అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.

కంటి చూపు రెట్టింపు అవుతుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం బయటకు తొలగిపోతాయి.

Telugu Amla, Anemia, Tips, Healthy, Latest-Telugu Health

ఆమ్లా జ్యూస్( Amla Juice ).ఇది కేవలం ఇమ్యూనిటీని పెంచడానికి మాత్రమే సహాయపడుతుందని చాలా మంది అభిప్రాయపడతారు.కానీ రక్తహీనతను తరిమి కొట్టడానికి కూడా ఆమ్లా జ్యూస్ హెల్ప్ చేస్తుంది.ఆమ్లా జ్యూస్ కోసం బ్లెండర్ తీసుకుని అందులో సన్నగా తరిగిన రెండు ఉసిరికాయలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు మరియు వాటర్ పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఆపై జ్యూస్ ని స్ట్రైన్ చేసుకుని నేరుగా సేవించాలి.రెగ్యులర్‌గా ఈ ఆమ్లా జ్యూస్ ను తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా ఆమ్లా జ్యూస్ ఐరన్ శోషణను ప్రోత్సహిస్తుంది.రక్తహీనత నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.

అదే స‌మ‌యంలో కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్థ్యాన్ని చేకూరుస్తుంది.

Telugu Amla, Anemia, Tips, Healthy, Latest-Telugu Health

ఇక రక్త హీనతను నివారించడానికి బీట్ రూట్ దానిమ్మ జ్యూస్ కూడా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ జ్యూస్ కోసం బ్లెండర్ లో ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, అర కప్పు దానిమ్మ గింజలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధమవుతుంది.ఈ జ్యూస్ ను నిత్యం తీసుకుంటే మన బాడీకి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ లభిస్తుంది.హిమోగ్లోబిన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి.రక్తహీనత పరారవుతుంది.పైగా ఈ జ్యూస్ ఆరోగ్యపరంగా మరిన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube