Hong Kong Flu : కరోనా లాంటి మరో పాండెమిక్‌ వచ్చే ప్రమాదముందా.. భయం పుట్టిస్తున్న నిపుణుల వ్యాఖ్యలు..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization )కోవిడ్-19ని ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా గుర్తించి నాలుగు సంవత్సరాలు అయ్యింది.ఇది ఇప్పుడు అంత తీవ్రంగా లేనప్పటికీ, మనం ఏ క్షణానైనా కొత్త మహమ్మారిని ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 There Is A Risk Of Another Pandemic Like Corona The Comments Of Experts Are Cau-TeluguStop.com

తాజాగా యూకే వ్యాధి నిపుణులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు, ఇది మరొక ప్రపంచ మహమ్మారి అవ్వచ్చు అన్నారు.లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ నథాలీ మాక్‌డెర్మాట్ (Dr Nathalie MacDermott )మాట్లాడుతూ.“మనం తదుపరి మహమ్మారిని త్వరలో లేదా కొన్ని సంవత్సరాలలో చూడవచ్చు, అందుకే అప్రమత్తంగా, సిద్ధంగా ఉండాలి.” అని అన్నారు.

అడవులను నరికివేయడం, భూమి వేడెక్కడం వల్ల జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సులభంగా వ్యాపిస్తున్నాయి.అమెజాన్ వంటి అడవులను నాశనం చేయడం వల్ల జంతువులు జనాలు నివసించే ప్రదేశాలకు వస్తున్నాయి.

దీనివల్ల మరిన్ని వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డాక్టర్ మాక్‌డెర్మాట్ పేర్కొన్నారు.అలాగే యూరప్ దేశాలలో దోమలు, పేలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి.డెంగ్యూ, చికున్‌గున్యా( Dengue, Chikungunya ) వంటి వ్యాధులకు ఇవి కారణమవుతున్నాయి.

Telugu Change, Covid Pandemic, Fear, Pandemic Corona-Telugu NRI

ప్రజలు తరచుగా కోవిడ్-19ని అరుదైన సంఘటనగా భావిస్తారు.కానీ మనం అనుకున్నదానికంటే ఇలాంటి మహమ్మారులు చాలా తరచుగా సంభవించే ప్రమాదం ఉందని చరిత్ర చూపిస్తుంది.HIV/AIDS మహమ్మారి 1981లో ప్రారంభమై 36 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది.1968లో, హాంకాంగ్ ఫ్లూ ( Hong Kong Flu )ఒక మిలియన్ మందిని చంపింది.ఇంకా వెనక్కి వెళితే, 1918లో స్పానిష్ ఫ్లూ 50 మిలియన్ల మరణాలకు కారణమైంది.

Telugu Change, Covid Pandemic, Fear, Pandemic Corona-Telugu NRI

మహమ్మారి ఏ సమయంలోనైనా సంభవించవచ్చని ఈ సంఖ్యలు మనకు గుర్తు చేస్తాయి.వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి.ప్రమాదాలను అర్థం చేసుకోవడం, వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం ద్వారా, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సంక్షోభాల నుంచి మనల్ని, మన సమాజాన్ని మనం రక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube