చలికాలంలో చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచే న్యాచురల్ ఫేస్ ఆయిల్ మీ కోసం..!

ప్రస్తుత చలికాలంలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పొడి చర్మం( dry skin ) అనేది ముందు వరుసలో ఉంటుంది.చల్లని మరియు పొడి వాతావరణం, వేడి వేడి నీటితో స్నానం చేయడం, వాటర్ సరిగ్గా తాగకపోవడం తదితర కారణాల వల్ల చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంటుంది.

 A Natural Face Oil That Keeps The Skin Moist And Soft In Winter Is For You! Natu-TeluguStop.com

పైగా డ్రై నెస్ వల్ల చర్మం విపరీతంగా దురద కూడా పెడుతుంటుంది.అయితే పొడి చర్మాన్ని రిపేర్ చేయడానికి అద్భుతమైన న్యాచురల్ ఫేస్ ఆయిల్ ఒక‌టి ఉంది.

రెగ్యులర్ గా ఈ ఆయిల్ ను వాడితే పొడి చర్మం అన్న మాటే అనరు.చలికాలంలో చర్మాన్ని తేమగా మృదువుగా ఉండటానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Naturalface, Tips, Face Oil, Latest, Skin Care, Skin Care Tips, Skin Mois

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) మరియు చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive oil ), హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక రోజంతా వదిలేస్తే మన ఫేస్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది.ఈ ఆయిల్ ను రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Naturalface, Tips, Face Oil, Latest, Skin Care, Skin Care Tips, Skin Mois

ప్రతిరోజు ఈ ఆయిల్ ను వాడటం వల్ల పొడిబారిన చర్మం తేమగా మృదువుగా మారుతుంది.డ్రై నెస్ పూర్తిగా తగ్గుతుంది.అలాగే ఈ ఆయిల్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.ఈ ఆయిల్ ను వాడటం వల్ల ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

అలాగే ఈ ఆయిల్ చర్మం పై మొండి మచ్చలను నివారిస్తుంది.పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.అంతేకాకుండా ఈ ఆయిల్ ను వాడటం వల్ల స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు ఆరోగ్యంగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube