దేవుడి దర్శనం కోసం వెళ్ళిన ఒక భక్తుడికి( Devotee ) వింత అనుభవం చోటు చేసుకుంది.తిరుపొరూర్ లోని మురుగన్ ఆలయంలో( Murugan Temple ) చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.చెన్నైకి చెందిన దినేశ్( Dinesh ) అనే భక్తుడు ఇటీవల తమిళనాడులోని తిరుపొరూర్‌లో ఉన్న మురుగన్ ఆలయానికి తన కుటుంబంతో కలిసి వెళ్లాడు.
స్వామిని దర్శించుకున్న తర్వాత హుండీలో కానుకలు వేస్తుండగా, అనుకోకుండా తన చేతిలో ఉన్న ఐఫోన్( Iphone ) కూడా హుండీలో పడిపోయింది.వెంటనే భక్తుడు ఆలయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.
అయితే, హుండీని తెరిచే సమయంలో తన ఫోన్‌ను తిరిగి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.కొన్ని రోజుల క్రితం ఆలయంలో హుండీని లెక్కించేందుకు తెరిచారు.అందులో దినేశ్ ఐఫోన్ కూడా కనిపించింది.కానీ, ఆయన ఆశ మాత్రం నిరాశగా మారింది.ఆలయ అధికారులు హుండీలో వేసిన వస్తువులన్నీ దేవుడికి అంకితమైనవేనని, వాటిని తిరిగి ఇవ్వడానికి వీలు లేదని తెలియచేసారు.
అయితే, ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డు, డేటాను మాత్రం తిరిగి ఇస్తామని అన్నారు.దీనితో చేసేదేమీ లేక దినేశ్ సిమ్ కార్డు తీసుకుని నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఈ సంఘటన భక్తులలో విభిన్న చర్చలకు దారితీసింది.
కొందరు ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.మరికొందరు మాత్రం భక్తుడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.మరి ఈ ఘటనపై మీరేమీ ఆలోచిస్తున్నారో ఓ కామెంట్ రూపంలో తెలపండి.